రెండు వేల రూపాయల నోట్ల(2000 Currency Notes ) మార్పిడికి సమయం ముగిసింది. ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank Of India) ప్రకటించింది.

రెండు వేల రూపాయల నోట్ల(2000 Currency Notes ) మార్పిడికి సమయం ముగిసింది. ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank Of India) ప్రకటించింది. అంటే ఇంకా పది వేల కోట్ల రూపాయల విలువైన నోట్లు మాత్రమే ప్రజల దగ్గర ఉన్నాయన్నమాట! ఈ ఏడాది మే 19వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. అందుకు స్పష్టమైన కారణాలు చెప్పలేదు కానీ గడవు మాత్రం విధించింది. ఆర్‌బిఐ ఈ ప్రకటన చేసే సమయానికి 3.56 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్‌ 31వ తేదీ బిజినెస్‌ ముగింపు సమయానికి ఈ విలువ పది వేల కోట్ల రూపాయలకు తగ్గింది. ఇప్పటికీ దేశంలోని 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో ప్రజలు 2,000 రూపాయల నోట్లను డిపాజిట్‌ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్‌బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్‌ శాఖ సేవలను పొందవచ్చని ఆర్‌బీఐ సూచించింది. కాగా, 2,000 రూపాయల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌ కోసం ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో భారీ క్యూలు కనిపిస్తున్నాయి.రెండువేల రూపాయల నోట్ల డిపాజిట్‌ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్‌ 7వ తేదీ వరకు అందించాయి. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ఈ సేవలను 19 ఆర్‌బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను ఒకసారి 20,000 రూపాయల వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ 2,000 రూపాయల నోట్లతో పాటు కొత్త 500 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చింది.

Updated On 2 Nov 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story