రూ.2,000 నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. రూ.2000 నోట్లను మార్చుకునే సౌకర్యం సాధారణంగానే ఉంటుందని పేర్కొంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెయిటింగ్ ఏరియా, తాగునీటి(Drinking Water) కోసం తగు ఏర్పాట్లు చేయాలని ఆర్‌బీఐ(RBI) బ్యాంకులకు సూచించింది.
రూ.2,000 నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. రూ.2000 నోట్లను మార్చుకునే సౌకర్యం సాధారణంగానే ఉంటుందని పేర్కొంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెయిటింగ్ ఏరియా, తాగునీటి(Drinking Water) కోసం తగు ఏర్పాట్లు చేయాలని ఆర్‌బీఐ(RBI) బ్యాంకులకు సూచించింది. 2000 నోట్ల మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను సేకరించాల్సిందిగా సెంట్రల్ బ్యాంక్ కూడా బ్యాంకులను కోరింది.
రూ.2000 నోటు మార్పుకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) మాట్లాడుతూ.. నోట్లను మార్చడానికి తొందరపడవద్దని అన్నారు. నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ 4 నెలల సమయం ఇచ్చింది. ఈ గడువులోపు ప్రజలు నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి లేకుండా ఇలాగే వదిలేస్తే అది అంతులేని ప్రక్రియ అవుతుందని పేర్కొన్నారు. రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఒక్కోసారి గరిష్టంగా రూ.20,000 విలువ చేసే 10 నోట్లను మార్చుకోవచ్చు. నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి స్లిప్/ఫారమ్ నింపాల్సిన, ఐడీని చూపించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది.