2000 నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిలిపివేసింది. మంగళవారం నుంచి రూ.2000 నోట్లను మార్చుకునే సదుపాయం కూడా ప్రారంభం కానుంది. ఇంతలో ఒక రూమర్ చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.1000 నోటును తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టనుందన్న ప్రచారం జరుగుతోంది. రూ.2,000 నోటును నిషేదించడంపై తలెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తుండగా.. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను(Shaktikanta Das) కూడా ఈ ప్రశ్న కూడా అడిగారు.

రూ.1,000 నోటును వెనక్కి తీసుకొచ్చే యోచన ఉందా అని శక్తికాంత దాస్‌ను అడగగా.. అయితే అలాంటి ప్లాన్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం పుకారు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500, 100 రూపాయల నోట్లు తగినంత పరిమాణంలో ఉన్నాయని, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.
రూ.2000 నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఆర్బీఐ గవర్నర్ కూడా స్పష్టం చేశారు. చెలామణిలో ఉన్న కరెన్సీలో కేవలం 10.8 శాతమే దాని వాటా అని ఆయన అన్నారు. ఆర్థిక లావాదేవీలలో రూ.2,000 నోటును పరిమితంగా ఉపయోగించడం గురించి తనకు సమాచారం ఉందని చెప్పారు.
ఆర్బీఐ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం నుంచి బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా రూ. 20,000 అంటే గరిష్టంగా 10 నోట్లను ఒకేసారి మార్చుకోవచ్చు. సెప్టెంబరు 30 వరకు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి కొనసాగుతుంది. మార్చుకున్న నోట్లు మళ్లీ మార్కెట్‌లోకి రావు. సెప్టెంబరు 30 తర్వాత కూడా రూ.2000 నోటు చెల్లుబాటు ముగియదని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.