ప్రత్యేక సందర్భాలప్పుడు ప్రత్యేక నాణాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) విడుదల చేస్తుంటుంది. అది సర్వ సాధారణం. అలాగే కొందరు మహనీయులను గుర్తు చేసుకుంటూ కూడా కాయిన్స్‌ను విడుదల చేస్తుంటుంది. డబ్బులు ఇస్తే మన బొమ్మతో కూడా కాయిన్స్‌ రిలీజ్‌ చేస్తారు కానీ అవి చెలామణిలో ఉండవు. ఆ మధ్యన సీనియర్‌ ఎన్టీఆర్‌పై చ్చిన వంద రూపాయల నాణెం అలాంటిదే! ఇప్పుడు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అలాంటి కార్యక్రమం ఒకటి జరగబోతున్నదంటూ సోషల్‌ మీడియాలో(Social media) తెగ ప్రచారం జరుగుతోంది.

ప్రత్యేక సందర్భాలప్పుడు ప్రత్యేక నాణాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) విడుదల చేస్తుంటుంది. అది సర్వ సాధారణం. అలాగే కొందరు మహనీయులను గుర్తు చేసుకుంటూ కూడా కాయిన్స్‌ను విడుదల చేస్తుంటుంది. డబ్బులు ఇస్తే మన బొమ్మతో కూడా కాయిన్స్‌ రిలీజ్‌ చేస్తారు కానీ అవి చెలామణిలో ఉండవు. ఆ మధ్యన సీనియర్‌ ఎన్టీఆర్‌పై చ్చిన వంద రూపాయల నాణెం అలాంటిదే! ఇప్పుడు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అలాంటి కార్యక్రమం ఒకటి జరగబోతున్నదంటూ సోషల్‌ మీడియాలో(Social media) తెగ ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ప్రముఖులపై నాణాలు విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పుడు రాముడి బొమ్మతో ప్రత్యేకంగా 500 రూపాయల(500 Note) నోటును ముద్రించబోతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మన కరెన్సీలలో(Currency) మహాత్మాగాంధీ(Gandhi) బొమ్మ మాత్రమే ఉంది. ఇక నుంచి గాంధీ బొమ్మ స్థానంలో రాముడి(Shri Ram) బొమ్మ ఉండబోతున్నదని, నోటుకు మరోవైపున రామాబాణం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పరిమిత సంఖ్యలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నోట్లను విడుదల చేయబోతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని కరెన్సీ నోట్ల ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీనిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన చేసింది. 500 రూపాయల నోటులో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది. శ్రీరాముని చిత్రంతో ఎలాంటి నోట్లను ముద్రించడం లేదని, సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న 500 రూపాయల నోట్లు నకిలీవని ప్రకటించింది.
500 రూపాయల నోటుపై రాముడి పటాన్ని ఉంచుతూ కొత్త కరెన్సీ నోట్లు ముద్రించాలంటూ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

Updated On 17 Jan 2024 2:23 AM GMT
Ehatv

Ehatv

Next Story