చెన్నైలోని(Chennai0 రిజర్వ్ బ్యాంక్ నుండి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి రెండు కంటైనర్ ట్రక్కులు. వాటిలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగిపోయింది.
చెన్నైలోని(Chennai) రిజర్వ్ బ్యాంక్ నుండి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి రెండు కంటైనర్ ట్రక్కులు. వాటిలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగిపోయింది. దీంతో జాతీయ రహదారిపై(High way) పోలీసులు ట్రక్కులకు ఎస్కార్ట్‌గా ఉన్నారు. రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ఓ ట్రక్కు చెడిపోయిందని తెలుసుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్షణ కోసం అధికారులు పోలీసులను పిలిచారు. జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీని అందించేందుకు రెండు లారీలు.. చెన్నైలోని ఆర్‌బీఐ కార్యాలయం నుంచి విల్లుపురం బయలుదేరాయి.
ట్రక్కులలో ఒకటి చెడిపోవడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా దానిని చెన్నైలోని తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు తరలించారు. తాంబరం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసన్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని చెడిపోయిన లారీని పరిశీలించారు. ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి, గేట్లను మూసివేశారు. ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశాన్ని నిషేదించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.