రెండు వేల రూపాయల నోటును(2000 notes) రిజర్వ్ బ్యాంక్(RBI) రద్దు చేసింది. ఆ నోట్లు ఉన్నవారు మార్చుకోవడానికి గడవు కూడా విధించింది. ఆ నోటును ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల దగ్గర 8,470 కోట్ల రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది.
రెండు వేల రూపాయల నోటును(2000 notes) రిజర్వ్ బ్యాంక్(RBI) రద్దు చేసింది. ఆ నోట్లు ఉన్నవారు మార్చుకోవడానికి గడవు కూడా విధించింది. ఆ నోటును ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల దగ్గర 8,470 కోట్ల రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. లాస్టియర్ మే 19వ తేదీన 2000 నోటును రిజర్వు బ్యాంక్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఉపసంహరించుకున్నప్పుడు మార్కెట్‌లో 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 8,470 కోట్లకు తగ్గాయి. వీటిల్లో 97.62 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఫిబ్రవరి 29వ తేదీనాటికి ఇంకా 8,470 కోట్ల రూపాయల విలువైన నోట్లు జమ కాలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.