కోటాలో విద్యార్థుల(Kota students) వరుస ఆత్మహత్యలు(Suicide) కలవరపెడుతున్నాయి. కోటి ఆశలతో, ఆకాంక్షలతో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం అత్యంత విషాదం! రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు చాలా ఫేమస్. ఆత్మహత్యలను నివారించడానికి జిల్లా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను చాలా హాస్టల్స్ పట్టించుకోవడంలేదు.
కోటాలో విద్యార్థుల(Kota students) వరుస ఆత్మహత్యలు(Suicide) కలవరపెడుతున్నాయి. కోటి ఆశలతో, ఆకాంక్షలతో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం అత్యంత విషాదం! రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు చాలా ఫేమస్. ఆత్మహత్యలను నివారించడానికి జిల్లా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను చాలా హాస్టల్స్ పట్టించుకోవడంలేదు. నీట్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇటీవల తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజీవ్‌గాంధీ నగర్‌లో(Rajiv gandhi nagar) జరిగిన ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ రవీంద్ర గోస్వామి(Ravindra gosami) ఆదేశాల మేరకు దర్యాప్తు చేశారు అధికారులు. విద్యార్థి మరణించిన హాస్టల్‌లో స్ప్రింగ్ ఫ్యాన్లు(Spring fan) లేకపోవడంతో అధికారులు దాన్ని సీజ్(Seize) చేశారు. ఆ హాస్టల్‌లో మొత్తం 32 గదులు ఉంటే, పది గదుల్లో మాత్రమే విద్యార్థులు ఉన్నారు. మిగిలిన గదుల్లోనివారిని వేరే చోటుకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కోటాలో నాలుగున్నరవేలకు పైగా హాస్టల్స్ ఉన్నాయి. 40 వేల పేయింగ్ గెస్ట్ గదులు ఉన్నాయి. ట్రైనింగ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఆత్మహత్యల నివారణకు స్థానిక యంత్రాంగం గత ఏడాది హాస్టళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని హాస్టల్ గదులలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లాస్టియర్ 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది నెల రోజుల్లోపే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.