సార్వత్రిక ఎన్నికల(General Elections) ఫలితాలు వచ్చేశాయి. ఎన్టీయే(NDA) కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు వచ్చినప్పటికీ బీజేపీ(BJP) సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ దక్కలేదు. మరోవైపు ఇండి(INDIA) కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసం వ్యూహరచన చేస్తున్నది. ఎటుచూసినా ఎన్టీయేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల(General Elections) ఫలితాలు వచ్చేశాయి. ఎన్టీయే(NDA) కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు వచ్చినప్పటికీ బీజేపీ(BJP) సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ దక్కలేదు. మరోవైపు ఇండి(INDIA) కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసం వ్యూహరచన చేస్తున్నది. ఎటుచూసినా ఎన్టీయేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంచితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన శంకర్ లాల్వాణీ తన సమీప ప్రత్యర్థిపై 11, 75,092 ఓట్ల మెజారిటీని సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు భవిష్యత్తులో బద్దలవుతుందని అనుకోలేం. ఇక దుభ్రీ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రబ్బీల్ హుస్సేన్ 10,12,476 ఓట్ల మెజారిటీని సాధించాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడం కూడా దర్లభమే! విదిశ నుంచి పోటీ చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్(Shivaraj singh chauhan) (BJP)కి 8,12,408 ఓట్ల మెజారిటీ వచ్చింది. భారీ విజయాలను కూడగట్టుకున్నవారే కాదు, స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన వారు కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని ముంబాయ్ నార్త్‌వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి ఏక్‌నాథ్ శిండే(Eknath shinde) వర్గం శివసేన పార్టీ నుంచి రవీంద్ర దత్తారామ్ వైకర్(Ravindra Dattaram Waikar) పోటీ చేశారు. ఉద్ధవ్ ధాక్రే శివసేన (యూబీటీ) నుంచి అన్మోల్ కీర్తికర్(Amol Kirtikar) నిలబడ్డారు. వీరి మధ్య గెలుపు చాలా సేపు ఊగిసలాడింది. చివరకు 48 ఓట్ల తేడాతో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రవీంద్ర దత్తారామ్ గెలుపొందారు. దత్తారామ్‌కు 4,52,644 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు రావడం గమనార్హం. కేరళలోని అత్తింగళ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్వొకేట్ అదూర్ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థిపై 684 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు లభించగా, సీపీఎం అభ్యర్థి వీ.జాయ్‌కు 3,27,367 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి. ఒడిశాలోని జయపురంలో బీజేపీ అభ్యర్థి రబీంద్ర నారాయణ్ బెహరా తన సమీప బిజూ జనతాదళ్ అభ్యర్థి శర్మిష్ఠా సేథి పై 1,587 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు 6,788 ఓట్లు పడటం గమనార్హం. రాజస్థాన్‌లోని జైపుర్ రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చోప్రా బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ చేతిలో 1,615 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ కూడా మెజారిటీ కంటే నోటాకే అత్యధికంగా 7,519 ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీరేశ్ ఠాకుర్ పై 1,884 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ నోటాకు ఏకంగా 18,669 ఓట్లుపడటం విశేషం.