దేశమంతా శ్రీరాముడి నామస్మరణ జపిస్తోంది. అంతా రామమయంతో నిండిపోయింది. అయోధ్యలో(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవాన్ని కనులార వీక్షించి పులకించిపోయింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి మురిసిపోయింది. ధర్మసంస్థాపన కోసం మాధవుడే రాముడిగా అవతరించాడు. పరిపూర్ణ మానవుడంటే ఇలా వుండాలని లోకానికి చాటి చెప్పాడు.ఆయన నడిచే ధర్మం.
దేశమంతా శ్రీరాముడి నామస్మరణ జపిస్తోంది. అంతా రామమయంతో నిండిపోయింది. అయోధ్యలో(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవాన్ని కనులార వీక్షించి పులకించిపోయింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి మురిసిపోయింది. ధర్మసంస్థాపన కోసం మాధవుడే రాముడిగా అవతరించాడు. పరిపూర్ణ మానవుడంటే ఇలా వుండాలని లోకానికి చాటి చెప్పాడు.ఆయన నడిచే ధర్మం.మూర్తీభవించిన ఆదర్శానికి ఆయన ప్రతీక. రాముడి(Sri Ram) కోసం దేశంలో వేలకొద్దీ ఆలయాలు ఉన్నాయి. అయితే లంకాధీశుడు(Ravan) అయిన రావణుడి ఆలయాలు కూడా దేశంలో ఉన్నాయి. అయోధ్య ఉన్న రాష్ట్రంలోనే రావణుడికి ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్‌లో(Kanpur) ఉన్న ఈ రావణాసురుడి ఆలయాన్ని 1868లో నిర్మించారు. దసరా రోజున ఇక్కడ రావణుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. నిజానికి రావణుడు గొప్ప శివభక్తుడు. శివస్త్రోత్రాన్ని రచించి పాడినవాడు. రావణుడికి రాజస్తాన్‌లోని(Rajasthan) జోధ్‌పూర్‌లో కూడా ఓ ఆలయం ఉంది. రావణుడి పట్టమహిషి మండోదరి(Mandodhari) అక్కడే జన్మించిందని స్థానికుల నమ్మకం. అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని విదిశ అనే ప్రాంతంలో కూడా రావణాసురుడి ఆలయ ఉంది.