జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు గోదాములో ఉంచిన 10 కిలోల గంజాయి
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు గోదాములో ఉంచిన 10 కిలోల గంజాయి, తొమ్మిది కిలోల 'భాంగ్'ని ఎలుకలు తిన్నాయని కోర్టుకు తెలిపారు. డిసెంబర్ 14, 2018న గంజాయి, భాంగ్ ఉన్నాయని శంభు అగర్వాల్, అతని కొడుకును అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా.. ప్రిన్సిపల్, సెషన్ జడ్జి రామ్ శర్మ కోర్టు జప్తు చేసిన వస్తువులను చూపించాలని దర్యాప్తు అధికారి జైప్రకాష్ ప్రసాద్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు మెటీరియల్‌ను సమర్పించలేకపోయారు. ఈ పదార్థాన్ని ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.
జప్తు చేసిన వస్తువులను ఎలుకలు తినేశాయని.. దర్యాప్తు అధికారి ఏప్రిల్ 6న నివేదిక సమర్పించారు. శంభు, అతని కొడుకు తరపున న్యాయవాది అభయ్ భట్ మాట్లాడుతూ పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పెట్టిన కేసు కూడా తప్పుడుదేనని అన్నారు. పట్టుకున్న పదార్థాల ఆధారంగా చట్టం తన పనిని చేసుకుంటూ వెళుతుందని.. పోలీసులు జప్తు చేసిన మెటీరియల్‌ను ఎందుకు సమర్పించలేకపోయారని ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణకు ధన్‌బాద్ పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశించారు.