శుక్రవారం మాఘ శుద్ధ సప్తమి. అంటే రథసప్తమి(Rathasaptami). భారతీయులకు ఇది పవిత్రరోజు. సూర్యుడిని ఆరాధించే రోజు. అయితే రథసప్తమి పర్వదినం కోసం ముందు రోజు నుంచే సంసిద్ధం కావాలి. షష్టి రోజు నూనె వెయ్యని పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. రాత్రి ఉపవాసం(Fasting) ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చేయాలి. అంటే నేల మీద నిద్రపోవాలి. ఇవన్నీ రథసప్తమికి ముందు రోజు చేయవలసిన పనులు. అయితే వృద్ధులకు, ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక రథసప్తమి రోజున నాలుగు విధులను నిర్వర్తించాలి. ప్రత్యేక స్నానమాచరించాలి. ఉపాసనచేయాలి. నైవేద్యం సమర్పించాలి. దానం ఇవ్వాలి.

రథసప్తమి రోజున వీలైతే ప్రవహించే నీరు అంటే నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. అలా కానిపక్షంలో షవర్‌ ఉన్నవారు షవర్‌ స్నానం చేయవచ్చు. స్నానం చేస్తున్నప్పుడు ఏడు జిల్లెడు ఆకులు, ఏడు రేగు ఆకులు శిరస్సుపై ఉంచుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు నాలుగు శ్లోకాలు చదవాలి. 'నమస్తే రుద్ర రూపాయా రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే' .'యధా జన్మ కృతం పాపం, మయా జన్మసుజన్మసు తన్మే రోగంచ శోకంచ మఖరీ హంతు సప్తమి'. 'ఏతత్ జన్మ కృతం పాపం, యచ్చ జన్మాంతరార్జితం. మనోవాక్కాయజం యచ్చ, జ్ఞాతా జ్ఞాతేచ యే పునః'.

'ఇతి సప్తవిధం పాపం, స్నానాన్ మే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి' ఇవి చదువుతూ స్నానమాచరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది. వీలైనంతవరకు రక్త వర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు ధరించాలి. చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజాదికములు నిర్వహించాలి. వీలైన వారు సూర్యనారాయణ ప్రతిమను ఆ రథంలో ఉంచాలి లేనిపక్షంలో తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యుని బొమ్మ చిత్రించి ఆ ఆకుని అందులో ఉంచాలి.తులసి కోట దగ్గర వీలైతే ఆవు పిడకలతో (తంపి)పెట్టి దానిపై ఆవుపాలతో కొత్త బియ్యం నెయ్యి బెల్లంతో ప్రసాదం తయారు చేయాలి. ఈ ప్రసాదం కలపటానికి చెరుకు గడను వినియోగించాలి.రథసప్తమి రోజు దానం అక్షయ తృతీయ లాగే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంతవరకు దానం చేయాలి. నోములు, వ్రతాలు, మంత్ర సాధన కొరకు గురు ఉపదేశం పొందుటకు రథసప్తమి చాలా అనువైన శుభదినం.

Updated On 15 Feb 2024 6:33 AM GMT
Ehatv

Ehatv

Next Story