సినీ నటి సిమి గరేవాల్‌ కూడా కలత చెందారు. తన ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా ఆవేదనతో కూడిన నివాళులు అర్పించారు

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. కన్నీటితో నివాళి అర్పిస్తున్నారు. దేశం ఒక రత్నాన్ని కోల్పయిందని బాధపడుతున్నారు. సినీ నటి సిమి గరేవాల్‌(Simi Garewal) కూడా కలత చెందారు. తన ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా ఆవేదనతో కూడిన నివాళులు అర్పించారు. ఒకప్పుడు సిమి గరేవాల్‌తో రతన్‌ టాటా(Ratan Tata) ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ తర్వాత సిమి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. రతన్‌ టాటా మరణవార్త విని సిమి తట్టుకోలేకపోయారు. 'మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. రతన్‌ టాటా నాలుగుసార్లు ప్రేమలో పడ్డారట. ఓసారి పెళ్లికి దగ్గరగా వచ్చారట! ఈ విషయాన్ని రతన్‌ టాటానే స్వయంగా చప్పారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయానని తెలిపారు. 'భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని రతన్‌ తెలిపారు. అమెరికాలో ఉన్నప్పుడు రతన్‌ ఓ అమ్మాయిని ప్రేమించారు. చదువు పూర్తయ్యాక అమెరికా నుంచి రతన్‌ ఇండియాకు వచ్చేశారు. ఆ అమ్మాయి కూడా ఇండియాకు రావడానికి సిద్ధపడ్డారు. అదే సమయంలో ఇండో -చైనా వార్‌ జరుగుతోంది. యుద్ధ భయంతో ఆమె ఇండియాకు రాలేదని, అమెరికాలోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నదని రతన్‌ టాటా ఓ సందర్భంలో చెప్పారు.

ehatv

ehatv

Next Story