భారతదేశం గ‌ర్వించే వ్యాపారవేత్త రతన్ టాటాను(Ratan Tata) మహారాష్ట్ర ప్రభుత్వం(Maharastra Government) శనివారం ప్రతిష్టాత్మక 'ఉద్యోగరత్న'(Udhyoga Ratna) అవార్డుతో సత్కరించింది. రతన్ టాటా నివాసంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లు ఆయ‌న‌ను అవార్డుతో స‌త్క‌రించారు.

భారతదేశం గ‌ర్వించే వ్యాపారవేత్త రతన్ టాటాను(Ratan Tata) మహారాష్ట్ర ప్రభుత్వం(Maharastra Government) శనివారం ప్రతిష్టాత్మక 'ఉద్యోగరత్న'(Udhyoga Ratna) అవార్డుతో సత్కరించింది. రతన్ టాటా నివాసంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లు ఆయ‌న‌ను అవార్డుతో స‌త్క‌రించారు. రతన్ టాటా ఆరోగ్య కారణాల వల్ల అవార్డు వేడుకకు హాజరు కాలేదు. ఈ కారణంగానే ఆయన ఇంట్లో అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారంతో పాటు ఇతర రంగాలకు రతన్ టాటా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ లో ఇది మాకు గర్వకారణం.. గౌరవం అని పోస్ట్ చేశారు. ఉద్యోగ రత్న అవార్డు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త అవార్డు. ఇది ఒక నిర్దిష్ట రంగంలో కృషి చేసిన విశిష్ట వ్యక్తులకు ఇవ్వబడుతుంది. ఈ అవార్డు మహారాష్ట్ర భూషణ్ పుర‌స్కారం కోవ‌కు చెందినది. వ్యాపారం, పరిశ్రమలు, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, IT, ఆహారం, ఆరోగ్య సంరక్షణ , ఇతర రంగాలలో కృషి చేసిన వ్య‌క్తులకు ఈ అవార్డు అంద‌జేయ‌నున్నారు.

Updated On 19 Aug 2023 6:09 AM GMT
Ehatv

Ehatv

Next Story