కొందరికి కొత్తగా పెళ్లి అవుతుంది. పెళ్లి అయినా కొందరు ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఉద్యోగాలు చేయడం సహజం. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య కారణాలు లేదా పెళ్లి లైఫ్‌ను కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దామనుకొని అప్పుడే పిల్లలు(Children) వద్దనుకుంటారు. కొన్ని రోజులు వెయిట్ చేసి పిల్లల కోసం ప్రయత్నిద్దామని అనుకుంటారు కానీ లైంగికంగా దూరంగా ఉండలేరు. అయితే ఈ సందర్భంగా వారికో వచ్చే డౌటేంటంటే... పిల్లలు అప్పుడే వద్దనుకుంటే కండోమ్స్(Condoms) బెటరా లేదా బర్త్ కంట్రోల్ పిల్స్(Birth Control Pics) బెటరా అని. దీంతో కొందరు సోషల్ మీడియాలోనో(Social media) లేదో అక్కడో ఇక్కడో చూసి సమాచారాన్ని సేకరించి వారికి నచ్చిన దాన్ని బట్టి ఫాలో అవుతుంటారు. కండోమ్స్ లేదా పిల్స్ వాడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ రెండింట్లో ఏది బెటర్? అనే ప్రశ్నలు రావడం కామన్..!
పెళ్లిళ్లలో(Marriage) వధూవరుల బంధువర్గాలు తిట్టుకోవడం, కొట్టుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ కొట్టుకోవడాలు కూడా సింపుల్ రీజన్‌లకే! మర్యాదలు జరగలేదనో, వంటలు బాగోలేవనో కాలర్లు పుచ్చుకుని కొట్టుకుంటారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) చోటు చేసుకుంది. ఓ వివాహ కార్యక్రమంలో రసగుల్లాల(Rasgulla) కోసం గొడవపడ్డారు. మొన్న ఆదివారం శంషాబాద్(Shamshabad) ప్రాంతంలో ఓ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి వచ్చినవారికి రుచికరమైన వంటకాలను వడ్డించారు. కాసేపటికి రసగుల్లాలు అయిపోయాయి. వచ్చిన అతిథుల్లో కొందరికి రసగుల్లాలు దొరకలేదు. దీంతో ఓ వ్యక్తి కోపంతో ఓ మాటన్నాడు. అది కాస్తా ఒకరినొకరు తిట్టుకోవడం వరకు వెళ్లింది. ఆపై కొట్టుకోవడం వరకు వెళ్లింది. ఈ గొడవల్లో ఆరుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాస్టియర్ ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఇలాగే పెళ్లి వేడుకలో స్వీట్ల కోసం ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఇందులో ఒకరు చనిపోయారు కూడా!