ఆధ్యాత్మికపరంగా కార్తీకమాసానికి(Karthika Masam) ఎన్ని విశిష్టతలు ఉన్నా సంబరాలకు, వేడుకలకు, ఉత్సవాలకు కూడా కార్తీకం అనువైన మాసం. కార్తీక పౌర్ణమిని(Karthika Pournami) అయితే చాలా దేశాలు శుభప్రదంగా భావిస్తాయి. ఆ రోజున ఉత్సవాలు(Celebrations) చేసుకుంటాయి. ఇక పున్నమిరేయిని మర్చిపోలేని మధురానుభూతిగా మిగల్చడానికి కొన్ని యాత్రస్థలాలు(Tourism Places) సిద్ధంగా ఉన్నాయి. కార్తీక పున్నమి వెన్నల్లో విహారమంటే అదో అందమైన అనుభవం... అదో అలౌకిక ఆనందం. పిండారబోసినట్టుగా ఉండే పండు వెన్నెల్లో , తెల్లటి ఇసుక తిన్నెల్లో తిరుగాడడం, ఒంటెలపై(Camel) ఊరేగడం గొప్ప అనుభూతినిస్తుంది.

ఆధ్యాత్మికపరంగా కార్తీకమాసానికి(Karthika Masam) ఎన్ని విశిష్టతలు ఉన్నా సంబరాలకు, వేడుకలకు, ఉత్సవాలకు కూడా కార్తీకం అనువైన మాసం. కార్తీక పౌర్ణమిని(Karthika Pournami) అయితే చాలా దేశాలు శుభప్రదంగా భావిస్తాయి. ఆ రోజున ఉత్సవాలు(Celebrations) చేసుకుంటాయి. ఇక పున్నమిరేయిని మర్చిపోలేని మధురానుభూతిగా మిగల్చడానికి కొన్ని యాత్రస్థలాలు(Tourism Places) సిద్ధంగా ఉన్నాయి. కార్తీక పున్నమి వెన్నల్లో విహారమంటే అదో అందమైన అనుభవం... అదో అలౌకిక ఆనందం. పిండారబోసినట్టుగా ఉండే పండు వెన్నెల్లో , తెల్లటి ఇసుక తిన్నెల్లో తిరుగాడడం, ఒంటెలపై(Camel) ఊరేగడం గొప్ప అనుభూతినిస్తుంది. ఆ స్వీట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకోవాలంటే అర్జెంట్‌గా గుజరాత్‌లోని(Gujarat) కచ్‌కు(Kutch) వెళ్లాలి. ఎందుకెళ్లాలంటే వెన్నెల రాత్రులలో తెల్లటి ఇసుక తిన్నెలపై విహరించడం మధురానుభూతి దొరుకుతుంది కాబట్టి! ఆ అందమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి పర్యాటకులు గుజరాత్‌కు పయనమయ్యారు. ఇంకా పయనమవుతున్నారు. కారణం అక్కడి రణ్‌ ఆఫ్‌ కచ్‌ను(Run Of Kutch) సందర్శించడానికి ఇంతకు మించిన సమయం ఉండదు.
ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు ఎడారి ఉన్నది గుజరాత్‌ రాష్ర్టంలోని రణ్‌ ఆఫ్‌ కచ్‌లోనే! కచ్‌ జిల్లాలో దాదాపు 30 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఎడారి. సంస్కృతంలో కచ్‌ అంటే ద్వీపం(Island).ఎడారులను(deserts) రణ్‌ అంటారు. రణ్‌ ఆఫ్‌ కచ్‌ అంటే ద్వీపంలా భాసిల్లుతోన్న ఎడారి అన్నమాట! కొన్నేళ్ల సింధునది కారణంగా ఈ ఎడారులు ముంపుకు గురయ్యాయి. చుట్టూ నీరు. మధ్యలో ఎడారి. అలా దీవిగా మారింది. అప్పుడెప్పుడో వచ్చిన భూకంపం సింధునది దిశను కొద్దిగా మార్చేసింది. పశ్చిమ దిశగా ప్రవహించడంతో ఎడారుల్లో ఉప్పునీటి మేటలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత చిత్తడిగా ఉండే ఉప్పు నీటి కయ్యలుగా మారాయి. శరదృతువు వచ్చేసరికి ఈ ప్రాంతం పూర్తిగా తడారిపోతుంది. ఉప్పుతో కూడిన ఇసుక తిన్నెలు ధవళకాంతుల్లో మిలమిలమని మెరిసిపోతుంటాయి. ఇక పౌర్ణమి రోజున వెన్నెల పిండారబోసినట్టుగా ఉంటుంది. ఆ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ఇసుక తిన్నెలపై లొట్టిపిట్టలపై వెన్నట్లో విహరిస్తుంటే ఈ జన్మకిది చాలనిపిస్తుంది. నవంబర్‌ 10వ తేదీ నుంచే ఇక్కడ రాణ్‌ ఫెస్టివల్‌ మొదలయ్యింది.. ఫిబ్రవరి 25 వరకు ఈ పండుగ కొనసాగుతుంది. పున్నమి వేళలో వెళితేనే బాగుంటుంది. రాత్రుళ్లు మాత్రమే ఉప్పుతో కూడిన ఎడారి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి ఉప్పు కరిగిపోయి సాధారణ ఎడారిగా మారిపోతుంది. తెలుపుదనం తగ్గిపోతుంది. అందుకే యామిని పూర్ణచంద్రికను చూసేందుకు తపించిపోతుంటారు పర్యాటకులు. ఇదే కాదు అక్కడ జరిగే హస్తకళల ప్రదర్శన కూడా గొప్పగా ఉంటుంది. నిజానికి హ్యాండీక్రాఫ్ట్‌కు కచ్‌ చాలా ఫేమస్‌.. గార్మెంట్స్‌ ఎంబ్రాయడరీ. హ్యాండ్‌వాల్‌ పెయింటింగ్స్‌... వుడ్‌ కార్వింగ్‌ వంటి కళల్లో ఇక్కడి వారు ఆరితేరారు. ఇక్కడి గ్రామల్లోని మహిళలు ఎంబ్రాయిడరీ వర్క్స్‌లో మహారాణులు.. అసలు మిర్రర్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ను ప్రపంచానికి పరిచయం చేసిందే వీళ్లు! ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్పనే అక్కర్లేదు

Updated On 1 Dec 2023 7:41 AM GMT
Ehatv

Ehatv

Next Story