భగవంతుని అవతారాలన్నింటీలో విశిష్టమైన అవతారం శ్రీరామావతారం(Sri Rama). మానవుడై పుట్టి మాధవుడైన వైనం. పితృవాఖ్య పరిపాలకుడిగా, జనరంజక పాలకుడిగా రాముని స్థానం అత్యత్తమమైనది. దుష్ట శిష్ణణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు అయిదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో వున్నకాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్నాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తూ ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై భూమ్మీద అవతరించాడు.

భగవంతుని అవతారాలన్నింటీలో విశిష్టమైన అవతారం శ్రీరామావతారం(Sri Rama). మానవుడై పుట్టి మాధవుడైన వైనం. పితృవాఖ్య పరిపాలకుడిగా, జనరంజక పాలకుడిగా రాముని స్థానం అత్యత్తమమైనది. దుష్ట శిష్ణణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు అయిదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో వున్నకాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్నాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తూ ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై భూమ్మీద అవతరించాడు. ఆ జగదానందకారకుడి కథనే రామాయణం. ఆ రామకథ కమనీయగాధ. రమణీయగాధ. స్మరణీయగాథ. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే కథ. రాక్షసజాతి అకృత్యాలను అంతం చేయడానికి ఆది దేవుడు మానవుడై అవతరిస్తాడు. ఆ అవతార మూర్తే రామచంద్రమూర్తి. దశరథ(King Dasharadha) మహారాజుకు పుత్ర సంతానం లేకపోవడంతో వశిష్ట మహాముని సలహామేరకు పుత్రకామేష్టి యాగం(Putthrakameshti Yagam) చేస్తాడు. యాగ పురుషుడు అవతరించి పాయసపాత్రను అందిస్తాడు. ఆ పాయసాన్ని పెద్ద భార్య కౌసల్యకు సగభాగాన్ని, ముద్దుల సతి కైకకు మిగిలిన సగభాగాన్ని ఇస్తాడు. ఇద్దరు సతులు ప్రేమతో సుమిత్రకు సగం సగం ఇస్తారు. కౌసల్యకు శ్రీరాముడు, కైకాదేవికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మిస్తారు.మరోవైపు జనక మహారాజుకు(King Janaka) ఆదిలక్ష్మి సీతాదేవిగా(Sita Devi) జన్మిస్తుంది. యజ్ఞయాగాదులకు అడ్డుపడుతున్న మారీచ సుబాహులను సంహరించిన మీదట రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట మిథిలా పురి చేరుకుంటారు. అక్కడ సీతా స్వయంవరంలో శివధనస్సును విరిచి సీతాదేవిని పరిణయమాడతాడు రామచంద్రుడు. ఆ తర్వాత రాముడి వనవాసం. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని లంకకు తీసుకెళ్లడం. వానరమూక సాయంతో రాముడు లంకాధీశుడుని చంపడం, సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అయోధ్యకు చేరుకోవడం. పట్టాభిషేకం జరగడం.. సంక్షిప్తంగా రామాయణ కథ ఇది!

ఆయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట శుభ సమయాన రామయణ గాధను పునశ్చరణ చేసుకోవడం పుణ్యదాయకం!
ఈ సందర్భంగా తెలుగులో రాముడిపై వచ్చిన అద్భుతమైన పాటలను జనవరి 22వ తేదీ వరకు రోజుకొక్కటి చొప్పున పరిచయం చేసుకుందాం! పాడుకుందాం!

రాముని అవతారం అనే మకుటంతో సాగే గొప్ప పాట భూకైలాస్‌(Bhukailas) సినిమాలో ఉంది. శ్రీరాముడి అవతారాన్ని కళ్లకు కట్టినట్టు సాగుతుందా పాట! ఎంవీఎం(MVM) సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భూకైలాస్‌ సినిమా 1958లో విడుదలయ్యింది. ఇందులో రావణాసురుడి పాత్రను ఎన్‌.టి.రామారావు(NT Rama Rao) అమోఘంగా పోషించారు. నారదుడిగా అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao) నటించారు. శివుడిగా నాగభూషణం, పార్వతీదేవిగా బి.సరోజాదేవి, మండోదరిగా జమున నటించారు. ఈ పౌరాణిక చిత్రరాజం ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. మహాశివరాత్రి రోజున ఈ సినిమా ప్రదర్శన తప్పనిసరి! ఆ రోజున ఈ సినిమా చూస్తే పుణ్యమనే భావన తెలుగు ప్రజలలో ఉంది. ఈ సినిమాకు సుదర్శనం-ఆర్‌.గోవర్ధనం సంగీతాన్ని అందించారు. సముద్రాల రాఘవాచార్య సాహిత్యాన్ని సమకూర్చారు.

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం
రవికుల సోముని అవతారం
రాముని అవతారం
రవికులసోముని అవతారం
రాముని అవతారం
రవికులసోముని అవతారం

సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
రాముని అవతారం
రవికులసోముని అవతారం

దాశరథిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరత

రాముని అవతారం
రవికులసోముని అవతారం

చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేత
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయి నహల్యకు శాపము
అంతము చేయి నహల్యకు శాపము
ఒసగును సుందర రూపం

రాముని అవతారం
రవికుల సోముని అవతారం

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిథిలానగరమునా

రాముని అవతారం
రవికులసోముని అవతారం

కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం
పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం
గురుజనసేవకు ఆదేశం
నరజాతికి నవ నవసంతోషం
గురుజనసేవకు ఆదేశం

రాముని అవతారం
రవికుల సోముని అవతారం

అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగన వంక
అడిగిన మరణమె నీ జింక

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానరకుల పుంగవ హనుమాన్‌
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానరకుల పుంగవ హనుమాన్‌
ముద్రిక కాదిది భువన నిదానం
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం
జీవన్ముక్తికి సోపానం

రామ రామ జయ రామ రామ
జయ రామ రామ రఘుకులసోమా
సీతాశోక వినాశనకారి
లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరం బౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మవిచారం

రాముని అవతారం
రవికులసోముని అవతారం
రాముని అవతారం
రవికులసోముని అవతారం

ఈ పాట సముద్రాల రాఘవాచార్య పాండిత్యం ఎంత గొప్పతో చాటి చెబుతుంది. ఈ పాటలో ముత్యాలవంటి పదాలను కూర్చారు. రవికుల సోముని అవతారం అంటే రాముడు సూర్యవంశానికి చంద్రుడి వంటి వాడట! రాముడి అవతారం భూలోకంలో ధర్మాన్ని నెలకొల్పడానికి ఒక నెపమే కానీ వాస్తవానికి తన ద్వారపాలురైన జయవిజయులను తిరిగి తన చెంతకు చేర్చుకునే కృపయెనట! రాముని అవతారం
రవికులసోముని అవతారం అని మళ్లీ మళ్లీ పాడుకోవడంలోనే గొప్పతనం కలిపిస్తుంది. ఇక సీతా స్వయంవరాన్ని సముద్రాల ఎంతో గొప్పగా వర్ణించారు. జనకుడి మనసులో ఈ విల్లును ఎక్కుపెట్టగలవారు ఎవరైనా ఉన్నారా అనే భయం.. సీతమ్మ మనసులోనేమో ఏదో సంశయం.. రాక్షసుల కలల సౌధం..మిథిలానగరంలో రాముడు ఎక్కుపెట్టిన విల్లు వీటన్నింటినీ ముక్కలు చేస్తూ విరిగిపోయిందట! నెపమే అయినప్పటికీ లోకోద్ధరణకు రాక్షస సంహారం తప్పసరి కాబట్టి అందుకు దారి తీయించే అరణ్యవాసం, అందుకు మూలం నిలిచిపోయిన పట్టాభిషేకం, అది కలిగించే తాత్కాలిక శోకం.. ఇవన్నీ ఆ నీలమేఘశ్యాముడు కల్పించిన కపట నాటకమేనట! ఇంత గొప్ప సాహిత్యాన్ని సముద్రాల రాఘవాచార్య తప్ప మరొకరు రాయలేరు. ఈ పాటలో ఆయన హరనయనాగ్ని పరాంగన వంక అంటారు. అంటే పరసతి శివుడి మూడో కన్నువంటిదట! ఇక మాయలేడిని వర్ణిస్తూ అది బంగరు జింక మాత్రమే కాదు, అడిగిన మరణంలాంటిదని చెబుతారు. సంగీత దర్శకులు సుదర్శనం, గోవర్ధనం స్వరపరచిన ఈ పాట వింటుంటూ జానపద సంగీతాన్ని ఎంత చక్కగా వాడుకున్నారో తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు అభినయించిన ఈ పాటలో మనకు బి.సరోజాదేవి, విజయనిర్మల కూడా కనిపిస్తారు. సీతగా నటించింది విజయనిర్మలే!

Updated On 5 Jan 2024 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story