జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్‌ నుంచి ఎంపీగా పోటీ చేశారు

సీనియర్‌ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసులు ఆమెపై నమోదై ఉన్నాయి. అయితే ఆ విచారణకు ఆమె హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్‌ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.

జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్‌ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్‌ పోలీస్‌ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్‌ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్‌ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.

ఒక కేసు కామ్రీ పోలీస్ స్టేషన్‌లో, మరొకటి స్వర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైందని ఒక అధికారి తెలిపారు. ప్రాసిక్యూషన్ వాంగ్మూలం పూర్తయింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 313 కింద జయప్రద వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. జయప్రద తన స్టేట్‌మెంట్ ఇవ్వడానికి కోర్టు అనేక తేదీలను నిర్ణయించింది, అయితే ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయబడిన ప్రతిసారీ ఆమె హాజరుకాలేదు. మంగళవారం కూడా ఆమె కోర్టుకు రాలేదు, ఆ తర్వాత రెండు కేసులకు సంబంధించి మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

Updated On 13 Feb 2024 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story