అయోధ్య రామమందిరంలో (Rama Mandiram) ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. అయోధ్య రామమందిరం దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా ఉండబోతుంది. దేశంలోని ఆలయాల్లో దర్శనానికి, ప్రసాదానికి ఇంత ధర అనేది ఉంటుంది. అయితే రామమందిరం దర్శనానికి, ప్రసాదానికి ఎలాంటి రుసుం తీసుకోవద్దని ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
అయోధ్య రామమందిరంలో (Rama Mandiram) ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. అయోధ్య రామమందిరం దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా ఉండబోతుంది. దేశంలోని ఆలయాల్లో దర్శనానికి, ప్రసాదానికి ఇంత ధర అనేది ఉంటుంది. అయితే రామమందిరం దర్శనానికి, ప్రసాదానికి ఎలాంటి రుసుం తీసుకోవద్దని ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుం లేకుండా దర్శనం చేసుకోవచ్చని చెప్తున్నారు. పేద, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. రాములవారి దర్శనం చేసుకున్న భక్తులకు ఎలాంటి రుసుం లేకుండా ప్రసాదం కూడా అందించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.
భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో నిర్మించిన ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. మరోవైపు అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఆలయ నిర్మాణం కాకముందు రోజుకు 1500 నుంచి 2 వే మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు ప్రారంభించిన తర్వాత రోజుకు 10 వేల మంది వరకు వచ్చేవారు. అదే సంఖ్య ఇప్పుడు రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు అయోధ్యకు వస్తున్నారు. రేపటి ప్రాణ ప్రతిష్ఠ లక్ష వరకు వచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ అంచనా వేస్తోంది. అందరికీ ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నామని ట్రస్ట్ పేర్కొంది. ఈ ఆలయ నిర్మాణానికి కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు (Ramajanmabhoomi Teertha Kshetra Trust) ప్రకటించింది. పూర్తిగా భక్తుల విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విరాళాలపై వస్తున్నవడ్డీ ద్వారానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఉన్న కౌంటర్లతో పాటు ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా విరాళాలు వస్తున్నట్లు తెలుస్తోంది.