జనవరి 22న రామజన్మభూమి మందిర్ 'ప్రాణ-ప్రతిష్ట' వేడుకకు ముందు గురువారం అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో (sanctum sanctorum) రామ్ లల్లా విగ్రహాన్ని (Ram Lalla idol) ఉంచారు. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరు వాసి చెక్కారు.

జనవరి 22న రామజన్మభూమి మందిర్ 'ప్రాణ-ప్రతిష్ట' వేడుకకు ముందు గురువారం అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో (sanctum sanctorum) రామ్ లల్లా విగ్రహాన్ని (Ram Lalla idol) ఉంచారు. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరు వాసి చెక్కారు. ఇతనికి ఐదు తరాల ప్రసిద్ధ శిల్పుల కుటుంబ నేపథ్యం ఉంది. బుధవారం విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. గురువారం గర్భగుడిలో జరిగిన స్థాపన కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహం, పరదాతో కప్పి ఉంచిన మొదటి ఫోటోను వెల్లడించారు. ఈ ఫొటోలను విశ్వహిందూ పరిషత్ (VHP) మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ షేర్ చేశారు.

ఆలయ పవిత్ర ప్రాంగణంలో వేద బ్రాహ్మణులు, పూజారులు పూజా కార్యక్రమం నిర్వహించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారని విశ్వహిందూ పరిషత్ తెలిపింది. గురువారం మధ్యాహ్నం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచినట్లు ముడుపుల వేడుకకు సంబంధించిన పూజారి అరుణ్ దీక్షిత్ (Arun Dixit) వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం జరిగిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust) తెలిపింది.

Updated On 18 Jan 2024 8:41 PM GMT
Ehatv

Ehatv

Next Story