అయోధ్య(Ayodhya) రామమందిరంలో(Ram Mandir) రాముడు ఎప్పుడు కొలువుతీరతాడా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22వ తేదీన జరగబోయే బాలరాముడి ప్రాణప్రతిష్టకు సబంధించిన కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా(Anil Mishra) ప్రాయశ్చిత్త సుమారు మూడు గంటల పాటు పూజలను నిర్వహించారు.
అయోధ్య(Ayodhya) రామమందిరంలో(Ram Mandir) రాముడు ఎప్పుడు కొలువుతీరతాడా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22వ తేదీన జరగబోయే బాలరాముడి ప్రాణప్రతిష్టకు సబంధించిన కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా(Anil Mishra) ప్రాయశ్చిత్త సుమారు మూడు గంటల పాటు పూజలను నిర్వహించారు. తర్వాత సరయూ నదిలో(Sarayu River) డాక్టర్ అనిల్ మిశ్రా పుణ్యస్నానం చేశారు. అటు పిమ్మట విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22వ తేదీన తెరుస్తారు. వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్(Arun Dixit) ఆధ్వర్యంలో మంగళవారం సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో దేవుడికి క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఇలా క్షమాపణలు చెప్పడం సంప్రదాయం. ఇవాళ బాలరాముని విగ్రహాన్ని(Statue) అయోధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకొస్తారు. తర్వా ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి.