అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ(Rakhi) పండుగ.

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ(Rakhi) పండుగ. ఈ నెల 19వ తేదీన ఈ పండుగ రాబోతున్నది. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కడతారు. ఈ పండుగ కోసం ఇప్పటి నుంచే వివిధ రకాల రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని(Uttarkhand) నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా తయారు చేస్తున్న రాఖీలకు మాత్రం ఫుల్లు డిమాండ్‌ ఉంది. ఆ రాఖీల స్పెషాలిటీ ఏమిటంటే ఆవు పేడలో(Cow dung) రకరకాల పప్పు దినుసులు కలిపి అందమైన రాఖీలుగా ఆమె తయారు చేస్తున్నారు. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి కాబట్టే వీటికి అంత డిమాండ్‌. తనలాగే ఇలాంటి రాఖీలు ఎవరైనా తయారుచేసి ఉపాధి పొందవచ్చని పూజా మెహతా అంటున్నారు. బస్‌గావ్‌ గ్రామంలో ఉంటున్న పూజా తాను తయారు చేస్తున్న రాఖీలను దేశంలో అన్ని ప్రాంతాలకు పంపిస్తానని చెప్పారు. ఢిల్లీ, గుజరాత్‌, ముంబాయిల నుంచి తనకు ఎక్కువ సఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని అన్నారు. ఈ రాఖీలను తాను ఒక్కోటి 40 రూపాయలకు అమ్ముతున్నానని, తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారానే ఈ రాఖీలను అమ్ముతున్నట్టు ఆమె తెలిపారు. ఈ ప్రత్యేకమైన రాఖీలను తయారుచేయడానికి ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినుసులు ఉపయోగిస్తానని చెప్పారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని పూజా మెహతా వివరించారు.

Eha Tv

Eha Tv

Next Story