Rakesh Kamal Family Murder : భారత సంతతి కుటుంబం మృతి కేసులో ఊహించని మలుపు
అమెరికాలో(America) భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద రీతిలో చనిపోయింది. వారం రోజుల కిందట మసాచుసెట్స్(Massachusetts) రాష్ట్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ కమల్‌తో(Rakesh Kamal) పాటు ఆయన భార్య టీనా కమల్(Tina Kamal) (54), కూతురు ఆరియానా(Ariyana) (18) ఇంట్లోనే చనిపోయారు. అయితే తాజాగా ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది.

రాకేష్ కమల్ కుటుంబ సభ్యుల మరణంపై నార్‌ఫోర్క్ డిస్ట్రిక్ అటార్నీ (District attorney) మైఖేల్ మొరిస్సే(Michael Morrissey) ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టమ్ జరిగింది. ప్రాథమిక అటాప్సీ రిపోర్ట్‌లో రాకేష్ కమల్ కుటుంబ సభ్యుల మరణానికి కారకులెవరో తెలిసింది.
భార్యబిడ్డలను చంపింది రాకేష్ కమలేనని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఇచ్చిన అటాప్సీ రిపోర్ట్‌లో తేలిందని మైఖేల్ మొరిస్సే తెలిపారు. ముందుగా రాకేష్ గన్‌తో భార్యను కాల్చి చంపాడు. తర్వాత కూతురును షూట్ చేసి చంపేశాడు. వాళ్లద‍్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక తర్వాత రాకేష్ తనకు తానే గన్‌తో కాల్చుకుని చనిపోయాడని మొరిస్సే చెప్పారు. .
అయిదేళ్ల కిందట రాకేశ్ కుటుంబం 19 వేల చదరపు అడుగుల ఎస్టేట్‌ను అయిదు మిలియన్లకు కొనుగోలు చేసింది. ఆ ఇంట్లోనే వారు ఉంటున్నారు. డిసెంబర్ 28వ తేదీన రాకేశ్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజులుగా రాకేశ్ కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కంప్లయింట్‌ను స్వీకరించిన పోలీసులు బాధితుల ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఆ ముగ్గురు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. రాకేష్ మృతదేహం సమీపంలో తుపాకీ లభ్యం కావడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గృహ హింస జరిగిందా? హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. లేటెస్ట్‌గా అటాప్సీ రిపోర్ట్‌లో టీనా, ఆరియానాను చంపింది రాకేషేనని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల రాకేష్ ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.