మహారాష్ట్ర(Maharashtra) రాజధాని ముంబైలో(Mumbai) విపక్షాల కూటమి ‘ఇండియా’(INDIA alliance) సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) హాజరుకావడం దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్(Congress) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇండియా కూటమి మూడవసారి సమావేశం కాగా.. నేడు రెండవ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే..
మహారాష్ట్ర(Maharashtra) రాజధాని ముంబైలో(Mumbai) విపక్షాల కూటమి ‘ఇండియా’(INDIA alliance) సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) హాజరుకావడం దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్(Congress) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇండియా కూటమి మూడవసారి సమావేశం కాగా.. నేడు రెండవ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఎస్పీ టిక్కెట్‌పై రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఈ సమావేశాలకు వచ్చారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. దీంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ ఫోటో క్లిక్ చేయడానికి ముందు.. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు దీనిపై ఫిర్యాదు చేశారు.
ఈ సమయంలో కొందరు నాయకులు కపిల్ సిబల్‌ను సమర్థించడం కూడా కనిపించింది. సిబల్‌ను సమర్ధించిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఇద్దరూ వేణుగోపాల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ కూడా సిబల్ రావడం తనకు అభ్యంతరం లేదనిఅన్నారు. దీంతో సిబల్ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.
నిజానికి ఈ సమావేశానికి సిబల్‌ను ఆహ్వానించలేదు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన గత ఏడాది మేలో ఎస్పీలో చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో సిబల్ అనేక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. న్యాయ మంత్రి నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఎదిగారు.