ట్రిపులార్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో భారతీయులంతా గర్వంతో ఉప్పొంగిపోయారు. నాటు నాటు పాట అంతర్జాతీయంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులను గడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆస్కార్ కూడా లభించడంతో ఆ పాటను దేశ విదేశాల్లోని యువత మళ్లీ మళ్లీ పాటేసుకుంటూ డాన్స్‌లు చేస్తోంది.
ట్రిపులార్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో భారతీయులంతా గర్వంతో ఉప్పొంగిపోయారు. నాటు నాటు పాట అంతర్జాతీయంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులను గడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆస్కార్ కూడా లభించడంతో ఆ పాటను దేశ విదేశాల్లోని యువత మళ్లీ మళ్లీ పాటేసుకుంటూ డాన్స్‌లు చేస్తోంది. ట్రిపులార్ పాటకు ఆస్కార్ రావడంతో రాజ్యసభ నాటు నాటు బృందానికి అభినందనలు తెలిపింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ దక్కడం తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అభవర్ణించారు. ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు ప్రధానంగా తెలుగవారికి ఓ చారిత్రక గుర్తింపు అని నరసింహరావు అన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిజానికి తెలుగు సినిమా అని, ఆస్కార్ పొందిన నాటు నాటు పాట తెలుగు పాట అని రాజ్యసభ సభ్యులకు తెలిపారు జీవీఎల్. ట్రిపులార్ సినిమా విజయం ఒక్కటి మాత్రమే కాదు, దాని దర్శకుడు రాజమౌళి బాహుబలి వంటి గొప్ప సినిమాను తెరకెక్కించాని, ఇది అంతర్జాతీయంగా సక్సెస్ సాధించిందని ఎంపీ జీవీఎల్ అన్నారు. ఈ చిత్రానికి రచయిత నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు జీవీఎల్. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మొత్తానికి జీవీఎల్ అభినందనలు తెలిపారు. అంతకు ముందు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ ట్రిపులార్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆయన నాటు నాటు అని అనడంతోనే సభలో ఉన్న సభ్యులంతా చప్పట్లు చరిచారు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు కూడా రాజ్యసభ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్ గుర్తింపు అంటూ ప్రశంసించారు.