రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) ఎమ్మెల్యేలు(MLA) తెలుగుదేశంపార్టీని(TDP) కోరుతున్నారట! అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీని సంప్రదిస్తున్నారట! ఈ మాట అంటున్నది టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Buchaiah Chaudhary). అది సాధ్యమయ్యేపనేనా?
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) ఎమ్మెల్యేలు(MLA) తెలుగుదేశంపార్టీని(TDP) కోరుతున్నారట! అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీని సంప్రదిస్తున్నారట! ఈ మాట అంటున్నది టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Buchaiah Chaudhary). అది సాధ్యమయ్యేపనేనా? అసలు రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి? క్రాస్ ఓటింగ్‌ను(Cross Voting) నిరోధించడానికి, పార్టీలలో క్రమశిక్షణ ఉల్లంఘన జరగకుండా ఉండడం కోసం ఓపెన్ బ్యాలెట్(Open Ballot) పద్దతిలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అప్పట్లో రహస్య బ్యాలెట్‌ను అనుమతించాలని కోరుతూ పిల్ దాఖలైతే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన మార్క్ బ్యాలెట్ పేపర్‌ను పార్టీ పోలింగ్ ఏజెంట్‌కు చూపించకపోతే ఆటోమాటిక్‌గా సదరు వ్యక్తి ఓటు రద్దు అవుతుంది. అంటే క్రాస్ ఓటింగ్‌కు తావుండదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి మరో పార్టీ అభ్యర్థికి వేసే ఓటు చెల్లదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది.
ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపిక అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎమ్ రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పదవీ కాలంలో ఏప్రిల్ 2వ తేదీతో ముగిస్తుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన వెలువడే అవకాశం ఉంది. లెక్కకైతే ఈ మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే దక్కుతాయి, కానీ తెలుగుదేశం పార్టీ కూడా పోటీలో ఉంటామని చెప్పేసరికి ఏమవుతుందోనన్న ఆసక్తి పెరిగింది. ఎందుకైనా మంచిదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలను రచించుకుంటోంది. ఇప్పటికే గంటా శ్రీనివాస్‌రావు రాజీనామాకు ఆమోదం తెలిపారు స్పీకర్. అంతే కాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన రాపాక వరప్రసాద్, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది స్పీకర్ కార్యాలయం. ఒక్కో రాజ్యసభ్య సభ్యుడి విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సి ఉంటుంది. మూడు రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచిన మేకపాటి శేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ప్రస్తుతం టీడీపీ క్యాంప్‌లో ఉంటున్నారు. వీరు వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసే ఛాన్స్ లేదు. ఇదలా ఉంచితే ప్రస్తుతం 28 మంది సిట్టింగ్‌లకు జగన్ టికెట్లు ఇవ్వలేదు. ఇందులో ముగ్గురు నలుగురు టికెట్లు ఇవ్వకపోయినా వైసీపీతోనే ఉంటామని గట్టిగా చెబుతున్నారు. మిగిలిన వారు విప్‌ను ధిక్కరించి ఓటు వేసినా చెల్లకుండా పోతుంది. ఇది తెలిసి కూడా టీడీపీ ఏ ధైర్యంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నదో అర్థం కావడం లేదు.