మణిపూర్‌(Manipur) అంశంపై పార్లమెంటు(Parliament) వర్షాకాల సమావేశాలు రచ్చకెక్కాయి. శుక్రవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెల‌కొంది. అయితే.. టీఎంసీ(TMC) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్(Derek O'Brien) చేసిన పని.. ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు(Jagdeep Dhankar) కోపం తెప్పించింది.

మణిపూర్‌(Manipur) అంశంపై పార్లమెంటు(Parliament) వర్షాకాల సమావేశాలు రచ్చకెక్కాయి. శుక్రవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెల‌కొంది. అయితే.. టీఎంసీ(TMC) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్(Derek O'Brien) చేసిన పని.. ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు(Jagdeep Dhankar) కోపం తెప్పించింది. దీంతో వెంటనే రాజ్యసభ కార్యకలాపాలను వాయిదా వేశారు.

మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు 47 మంది ప్రతిపక్ష ఎంపీలు రూల్(MP Rule) 267 కింద నోటీసు ఇచ్చారు. మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ అభ్యంతరం తెలుపుతూ.. ఎంపీల తీరును ప్రపంచం చూస్తోందన్నారు. చైర్మన్ మాట్లాడుతుండగా.. మణిపూర్ అంశంపై చర్చ జరగాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్ ధన్‌కర్‌ తన మాట వినాలని టీఎంసీ ఎంపీని కోరారు.

చైర్మన్ ఇలా అనడంతో టీఎంసీ ఎంపీలు ఆందోళ‌న‌ ప్రారంభించగా.. చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ఈ సీటును గౌరవించాలి.. ఇలా రచ్చ చేయడం మీకు అలవాటైపోయింది' అని అన్నారు. దానికి టీఎంసీ ఎంపీ టేబుల్‌పై చేయి కొట్టి.. 'నాకు కూడా రూల్స్ తెలుసు' అని పెద్ద గొంతుతో బ‌దులిచ్చారు. దీనిపై స్పీకర్ జగదీప్ ధన్‌ఖర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. టీఎంసీ ఎంపీ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభా కార్యక్రమాలు ఇలాగే సాగలేవని అన్నారు. అనంతరం సభాపతి సీటు నుంచి లేచి రాజ్యసభ కార్యక్రమాలను రోజంతా వాయిదా వేశారు.

దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రకటన చేయాల‌ని ప్రతిపక్షాలు ప్రధానిని డిమాండ్ చేస్తున్నాయి. చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతిపక్షాలు త‌మ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

Updated On 28 July 2023 4:12 AM GMT
Ehatv

Ehatv

Next Story