ఓ పెంపుడు కుక్క(Pet Dog) ఒకే సారి 9 పిల్లలను కన్నది. దీంతో ఆ కుక్కను పెంచుకున్న మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఊరంతా సంబరాలు చేసింది. 400 మందికి భోజనాలు(Lunch) ఏర్పాటు చేసింది. పాటల కచేరీ(Party) కూడా ఏర్పాటు చేసింది. డప్పు వాయిద్యాలు కూడా ఏర్పాటు చేసింది.

ఓ పెంపుడు కుక్క(Pet Dog) ఒకే సారి 9 పిల్లలను కన్నది. దీంతో ఆ కుక్కను పెంచుకున్న మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఊరంతా సంబరాలు చేసింది. 400 మందికి భోజనాలు(Lunch) ఏర్పాటు చేసింది. పాటల కచేరీ(Party) కూడా ఏర్పాటు చేసింది. డప్పు వాయిద్యాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని(Uttar Pradesh) హమీర్‌పూర్‌(Hamirpur) జిల్లా మేరాపూర్‌(Merapur) గ్రామంలో జరిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజ్‌కాళీ(Rajkali) అనే మహిళ ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి చట్నీ అనే పేరు పెట్టింది. అల్లారుముద్దుగా కుక్కను పెంచుకుంది. తాను పెంచుకుంటున్న కుక్క 9 మందికి జన్మనివ్వడంతో దాని యజమానురాలు రాజ్‌ కాళీ అంబరాన్నంటించే సంబరాలు చేసింది. ఆనందంతో గెంతులేసింది. బంధువులను, గ్రామస్తులను పిలిచి పెద్ద దావత్‌ చేసింది. 400 మందికి భోజనాలు అరేంజ్‌ చేసింది. అంతటితో ఆగకుండా పాటల కచేరీతో పాటు డప్పు వాయిద్యాలు కూడా ఏర్పాటు చేసింది. కుక్క పిల్లలను అందంగా అలంకరించి తొట్టెలలో పెట్టింది. మహిళలతో జోల పాటలు పాడించింది. దీనిపై రాజ్‌ కాళి వివరిస్తూ తాను ఈ కుక్కను పెంచుకున్నప్పటి నుంచి తన కష్టాలు తొలగిపోయని తెలిపింది. సాధారణంగా కుక్కకు 4 నుంచి 6 పిల్లలే పుడతాయి కానీ ఈ కుక్కకు 9 పిల్లలు పుట్టడంతో చాలా సంతోషంగా ఉంది అని రాజ్‌ కాళి చెప్పింది. గతంలో ఎన్నో కుక్కలను పెంచుకున్నా కొన్ని రోజుల తర్వాత ఆ కుక్కలు వెళ్లిపోయాయని.. అయితే చట్నీ మాత్రం తనను వదిలి వెళ్లలేదని రాజ్‌ కాళి చెప్పింది. చట్నీపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న రాజ్‌కాళీ డెలివరీతో ఇంత భారీ విందు ఏర్పాటు చేసిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో అతిథుల కోసం భోజనంతో పాటు మిఠాయిలు తయారు చేయించింది. తొలుత ఈ కార్యక్రమాన్ని చూసి ఆ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతోందని అనుకున్నారు. కానీ కుక్క డెలీవరీతో ఈ విందు ఏర్పాటు చేశారని తెలియడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

Updated On 10 Nov 2023 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story