సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు(Farmers) ఆందోళనలు చేస్తున్న సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తడి ఎదురయ్యిందంటూ ట్విట్టర్(Twitter)మాజీ సీఈవో జాక్ డోర్సే(Jack Dorsey) సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రం(Central government) కొట్టేసింది. ఆయన చెబుతున్నవి పచ్చి అబద్ధాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajiv chandra shekar) వివరణ ఇచ్చుకున్నారు. మొన్నామధ్య ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న జాక్ డోర్సే కేంద్ర ప్రభుత్వంపై ఈ ఆరోపణలు చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు(Farmers) ఆందోళనలు చేస్తున్న సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తడి ఎదురయ్యిందంటూ ట్విట్టర్(Twitter)మాజీ సీఈవో జాక్ డోర్సే(Jack Dorsey) సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రం(Central government) కొట్టేసింది. ఆయన చెబుతున్నవి పచ్చి అబద్ధాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajiv chandra shekar) వివరణ ఇచ్చుకున్నారు. మొన్నామధ్య ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న జాక్ డోర్సే కేంద్ర ప్రభుత్వంపై ఈ ఆరోపణలు చేశారు. ఏ ప్రభుత్వం నుంచైనా మీకు ఒత్తిళ్లు ఎదురయ్యాయా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జాక్ డోర్సే ఈ మాట చెప్పారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో తమకు భారత ప్రభుత్వం నుంచి అనేక అభ్యర్థలను వచ్చేవని డోర్సే అన్నారు. ఒకానొక సందర్భంలో భారత్‌లో(India) ట్విట్టర్‌ను మూసేస్తామని కొందరు బెదిరించారని ఆయన ఆరోపించారు. మిమ్మల్ని బెదిరించినవారెవరూ అన్న దానికి మాత్రం డోర్సే బదులివ్వలేదు. జాక్ డోర్సే ఆరోపణలను రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు.
ఆయన సీఈవోగా ఉన్న సమయంలో ట్విట్టర్ భారత చట్టాలను అనేక సార్లు ఉల్లంఘించిందని చెప్పారు. 2020- 2022 మధ్య పదే పదే నిబంధనలను అతిక్రమించారని కేంద్ర మంత్రి తెలిపారు. జూన్ 2022 తర్వాత నుంచే ట్విట్టర్ భారత నిబంధనలకు అనుగుణంగా పని చేయడం మొదలు పెట్టిందని చెప్పారు. డోర్సే ఆరోపిస్తున్నట్టు తాము ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లపై సోదాలు(Rides) నిర్వహించలేదని , ఎవరినీ జైలుకు పంపలేదని స్పష్టం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి డోర్సే హయాంలోని ట్విటర్ విముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. 2021 జనవరిలో జరిగిన రైతుల ఆందోళన సమయంలో సోషల్ మీడియాలో అనేక దుష్ప్రచారాలు వైరల్ అయ్యాయని, వాటిలో నరమేధం వంటి అసత్య ప్రచారాలు కూడా ఉన్నాయని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇలాంటి ఘటనలు అమెరికాలో జరుగుతున్నప్పుడు మాత్రం తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ వెంటనే తొలగించిందని, మన దేశానికి వచ్చేసరికి వారికి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. డోర్సే సీఈఓగా ఉన్నప్పుడు ట్విటర్ అనుసరించిన పక్షపాత వైఖరికి ఇది నిదర్శనమన్నారు.