పబ్జీ గేమ్‌(PubG Game) ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ సరిహద్దులు దాటేలా చేసింది. ఆ విధంగా పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్‌పై(Sima Haider) అనేకానేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ను కలుసుకోవడం కోసం సరిహద్దుదాటి పాకిస్తాన్‌కు వెళ్లింది రాజస్తానీ వివాహిత అంజు(anju).. ఈమె వ్యవహారం కూడా అనుమానాస్పందగానే ఉంది.

పబ్జీ గేమ్‌(PubG Game) ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ సరిహద్దులు దాటేలా చేసింది. ఆ విధంగా పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్‌పై(Sima Haider) అనేకానేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ను కలుసుకోవడం కోసం సరిహద్దుదాటి పాకిస్తాన్‌కు వెళ్లింది రాజస్తానీ వివాహిత అంజు(anju).. ఈమె వ్యవహారం కూడా అనుమానాస్పందగానే ఉంది. తాము ప్రేమికులం కాదని, కేవలం స్నేహితులం మాత్రమేనని అంజు, నస్రుల్లా(Nasrullah) చెప్పిన కొన్ని గంటలకే అంజు మతం మార్చుకున్నదని, ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను పెళ్లి చేసుకుందని మీడియాలో కథనాలు వచ్చాయి . ఈ మేరకు ఫోటోలు, వీడియోలు, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కూడా వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత ఇండియాకు చెందిన ఓ నేషనల్‌ ఛానెల్‌ అంజు, నస్రుల్లాను విడివిడిగా సంప్రదించింది. వారద్దరూ మీడియాలో వస్తున్న కథనాలను కొట్టేశారు.

తమకు పెళ్లి జరిగిందన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. తాను అంజును పెళ్లి చేసుకోలేదని, తమ పేరుతో వైరల్‌ అవుతున్న సరిఫికెట్‌ ఫేక్‌ అని నస్రుల్లా అన్నాడు. పుకార్లను నమ్మవద్దని విన్నవించుకున్నాడు. 'అంజు కేవల నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. మా ఇద్దరి గురించి మీడియాలో రావడంతో భద్రత కోసమే కోర్టుకు వెళ్లాము. ఇక్కడ బుర్ఖా సంప్రదాయం కాబట్టి ఆమె ధరించింది అంతే! అంజూ విదేశీయురాలు. పైగా భారతీయురాలు. ఆమెకు ముప్పు పొంచి ఉండటం సహజం. అందుకే ప్రభుత్వం కూడా మాకు భద్రత కల్పించడానికి ముందుకు వచ్చింది. 50 మంది పోలీసులు మాకు భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మేము కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.

ఆమె హిందువుగానే ఉంది. మతం మార్చుకున్నదన్న వార్తల్లో నిజం లేదు. టూరిస్ట్‌ వీసా మీద పాకిస్తాన్‌ను చూడటానికి వచ్చింది. భర్తతో ఆమెకు గొడవలు వచ్చాయని.. విడాకుల ప్రక్రియ నడుస్తోందని నాకూ తెలుసు. విడాకులు మంజూరు అయ్యాక నన్ను ఇష్టపడితే ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటాను . కానీ, అది ఆమె నిర్ణయం. ఇప్పటికైతే.. ఆగష్టు నాలుగున వీసా గడువు ముగిశాక ఆమె తిరిగి భారత్‌కు వెళ్లిపోతుంది' అని నస్రుల్లా వివరించాడు. మరోవైపు అంజు కూడా పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది. 'పాకిస్తాన్‌కు వెళ్లాలనుకున్నాను. వెళ్లాను. నేనేం మతం మారలేదు. ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఇక్కడ ఓ ఫేమస్‌ వ్లోగర్‌ మా ఇద్దరినీ కలిపి షూట్‌ చేశాడు. అంతేగానీ.. అదేం ప్రీ వెడ్‌ షూటో, పోస్ట్‌ వెడ్‌ షూటో కాదు. అన్నీ వదంతులే! నేను నస్రుల్లా మంచి స్నేహితులం. నేను ఇంకా భారతీయురాలినే. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటాను' అని అంజు పేర్కొంది.

ఇదిలా ఉంటే, 34 ఏళ్ల అంజు ఇంటి నుంచి వెళ్లిపోయి మతం మార్చుకున్నదని, పాకిస్తాన్‌ ఖైబర్‌ ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లాను పెళ్లి చేసుకున్నదని పాక్‌ నుంచి కథనాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి గయా ప్రసాద్‌ కన్నీరుమున్నీరయ్యారు. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో బౌనా గ్రామంలో ఉంటున్న ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఇద్దరు పిల్లలు, భర్త గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కనీసం బిడ్డల గురించి కూడా ఆలోచించలేదు. తన ఇష్టం, తన జీవితం తనది కావొచ్చు.

కానీ, ఇలా చేయాలనుకుంటే.. ముందు భర్తకు విడాకులు ఇవ్వాలి కదా. కానీ, ఇలా పరువు తక్కువ పని చేయకూడదు కదా. అన్ని బంధాలను తెంచుకున్న అంజు ఇక మా దృష్టిలో చచ్చినట్లే' అని గయా ప్రసాద్‌ థామస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.అంజు మానసిక స్థితి సరిగ్గా లేదని, తిరిగొస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ అంతకు ముందు చెప్పిన గయా ప్రసాద్‌ ఆమె పెళ్లి చేసుకున్నదన్న వార్త తెలియగానే షాక్‌ అయ్యారు. ఆమెను భారత్‌కు రప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అన్న ప్రశ్నలకు నిర్మోహమాటంగా జవాబిచ్చారు. అలాంటి ప్రయత్నమేమీ చేయబోనని అన్నారు. 'చస్తే అక్కడే చావనివ్వండి.. తన ఇద్దరి పిల్లలను మేం చూసుకుంటాం' అని గయా ప్రసాద్‌ అన్నారు

Updated On 26 July 2023 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story