సాధారణంగా భారతదేశం వ్యాప్తంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కల వివిధ దేవతల పేరుతో ఆలయాలు(Temples) ఉంటాయి. ఆయా దేవాలయాల్లోకి చూస్తూ దేవుడిని స్మరించుకుంటూ ముందుకెళ్తుంటాం. కానీ మీరు రాజస్థాన్‌లోని(Rajasthan) జోద్‌పూర్(Jodhpur)-అహ్మదాబాద్(Ahmedabad) మధ్య ఉన్న జాతీయరహదారి 62లో(NH62) ఓ దేవాలయం ఉంటుంది. కాకపోతే ఆ ఆలయంలో దేవుడు ఉండరు. ఏంటా కథ చూద్దాం...

జోద్‌పూర్-అహ్మదాబాద్ నేషనల్ హైవేలో పాలి(Pali) పట్టణానికి 20 కి.మీ.దూరంలో, జోధ్‌పూర్ కంటే 53 కి.మీ.దూరంలో చోటిలా(chotila) అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ఆలయాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండరు. ఆలయంలో మూల విరాట్‌గా 'RNJ 77773' రిజిస్ట్రేషన్ కలిగిన బుల్లెట్(Bullet Bike) ఉంటుంది. ఇది 350 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్. ఈ ఆలయాన్ని ఓం బన్నా మందిరం లేదా బుల్లెట్ బాబా ఆలయం అని పిలుస్తారట. ఈ ఆలయంలో ఆ బైక్ అప్పటి యజమాని ఓం సింగ్ రాథోడ్(Om Singh Rathore) విగ్రహం, ఫొటో కూడా ఉన్నాయి.
1988లో చోటిలా గ్రామ నాయకుడి కుమారుడు ఓంసింగ్ రాథోడ్ బుల్లెట్ ప్రమాదంలో మరణించాడు. దీంతో స్థానిక పోలీసులు బుల్లెట్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరుసటి రోజు ఈ బుల్లెట్ పోలీస్‌స్టేషన్ నుంచి మాయమై ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రత్యక్షమైందట. బుల్లెట్‌ను మరోసారి పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు(Police station) తరలించినా.. తిరిగి అదే ప్రదేశంలో కనిపించిందట. ఇలా పోలీసులు తీసుకెళ్లడం.. బుల్లెట్ ఇక్కడ ప్రత్యక్షం కావడమనేది పలుసార్లు జరిగింది. దీంతో ప్రమాదం జరిగిన చోటనే బుల్లెట్‌కు ఆలయం నిర్మించాలని స్థానికులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయాన్ని నిర్మించి 'RNJ 77773' బుల్లెట్‌నే విగ్రహంగా ప్రతిష్టించారు. ప్రమాదంలో మృతిచెందిన ఓంసింగ్ రాథోడ్ విగ్రహం నెలకొల్పి.. ఆయన ఫొటోను ఉంచారు.
దీంతో అప్పటి నుంచి ఇది ఓం బన్నా మందిరం(Om Banna Mandir) లేదా బుల్లెట్ బాబా ఆలయమని(Bullet Baba Temple) ప్రసిద్ధి చెందింది. కొత్తగా బైక్ కొన్న యువకులు ఇక్కడికి వచ్చి తమ బైక్‌లకు పూజలు నిర్వహిస్తారు. వీరితో పాటు బైక్‌లు కొన్న యువకుల భార్యలు, తల్లులు కూడా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయం ఎదుట ఉన్న చెట్టుకు ఎర్రదారాన్ని చుట్టి ఆరాధిస్తున్నారు. కొత్త బైక్‌లకు ఈ ఆలయంలో పూజలు చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని.. ఆలయం నిర్మించిన నాటి నుంచి దీనిని పాటిస్తున్నామని భక్తులు అంటున్నారు.