రాజస్తాన్‌లో(Rajasthan) ఓ మేజిస్ట్రేట్(Magistrate) వ్యవహారశైలిపై దుమారం చెలరేగుతోంది. అత్యాచార బాధితురాలిని దుస్తులు విప్పి గాయాలు చూపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరౌలీ(Karuli) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్చి 19వ తేదీన తనపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారంటూ 18 ఏళ్ల ఓ దళిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ జరగుతోంది.
రాజస్తాన్‌లో(Rajasthan) ఓ మేజిస్ట్రేట్(Magistrate) వ్యవహారశైలిపై దుమారం చెలరేగుతోంది. అత్యాచార బాధితురాలిని దుస్తులు విప్పి గాయాలు చూపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరౌలీ(Karuli) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్చి 19వ తేదీన తనపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారంటూ 18 ఏళ్ల ఓ దళిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ జరగుతోంది. విచారణ సందర్భంగా జడ్జి దుస్తులు విప్పి గాయలు చూపించాలని ఆ యువతిని ఆదేశించారు. దానికి నిరాకరించిన ఆ అమ్మాయి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీనా తెలిపారు. మార్చి 30వ తేదీన బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మన్సిఫ్ కోర్టుకు వెళ్లింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఉండగా బాధితురాలిని మేజిస్ట్రేట్ తన ఛాంబర్‌లోకి పిలిచారు. లోపల స్టేట్‌మెంట్ తీసుకున్న తరువాత ఆమెను ఆపి శరీరంపై గాయాలను చూడాలని, దుస్తులు విప్పాలని అడిగారు. మహిళా పోలీసు లేకుండా ఆమె దుస్తులు తీసేందుకు నిరాకరించడంతో బయటకు పంపించారు. అనంతరం న్యాయమూర్తి చెప్పిన విషయాలను బాధితురాలు తల్లి, సోదరులకు చెప్పింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంపై విచారణ అధికారిని నియమించారు. రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ చౌదరి హిందౌన్ దాదాపు మూడు గంటల పాటు మేజిస్ట్రేట్‌ను విచారించి, వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ఇతర న్యాయమూర్తులను, ఇతర న్యాయవాదులను పిలిపించి వారిని అడిగి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి ప్రవర్తనపై సమాచారం సేకరించారు.
ఇదిలా ఉంటే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినప్పటి నుంచి రాజీ కోసం నిందితులు ప్రయత్నిస్తున్నారు! కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఆమెను బెదిరిస్తున్నారు. ఆ భయానికి బాధితురాలి కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. విషయం తెలసుకున్న పోలీసులు ఆమె కుటుంబాన్ని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. అత్యాచారం కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ గిర్వార్ సింగ్ తెలిపారు.