పది మంది దృష్టిలో పడాలంటే ఓ తెలివైన పనైనా చేయాలి. లేదా తలతిక్క చేష్టలైనా చేయాలి. చాలా మంది రెండో దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాంటివాడే రాజస్తాన్‌లోని(Rajasthan) జైపూర్‌కు(Jaipur) చెందిన వ్యక్తి. ఇతగాడు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను(Aether Electric Scooter) కొన్నాడు

Rajasthan
పది మంది దృష్టిలో పడాలంటే ఓ తెలివైన పనైనా చేయాలి. లేదా తలతిక్క చేష్టలైనా చేయాలి. చాలా మంది రెండో దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాంటివాడే రాజస్తాన్‌లోని(Rajasthan) జైపూర్‌కు(Jaipur) చెందిన వ్యక్తి. ఇతగాడు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను(Aether Electric Scooter) కొన్నాడు. ఉత్తినే కొంటే నలుగురికి తెలియదనుకుని స్కూటర్ కొనడానికి మొత్తం చిల్లర ఇచ్చాడు. షోరూమ్ వారికి షాక్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష రూపాయలకంటే ఖరీదైన స్కూటర్‌ను చిల్లర నాణేలతోనే కొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. స్కూటర్‌ను డెలివరీ చేసిన ఏథర్ ఎనర్టీ సీఈవో ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. జైపూర్ వ్యక్తి పది రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని రాసుకొచ్చారు.
