రాజస్తాన్‌లో(Rajasthan) ఓ లేడీ డాక్టర్ పానీపూరీలు (Panipuri) అమ్ముకుంటున్నారు. పానీపూరీ బండిపై ప్రైవేట్ డాక్టర్ అని రాసిపెట్టుకున్నారు కూడా! ఆమెతో పని చేసిన సిబ్బందేమో పక్కనే టీ అమ్ముకుంటున్నారు. మరో డాక్టర్ తన ఆసుపత్రిని పరాఠా సెంటర్‌గా మార్చుకున్నాడు. ఇతనే కాదు ఇంకా చాలా మంది డాక్టర్లు రోడ్డుపై ఇలా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎందుకు? డాక్టర్ వృత్తిలో డబ్బులు రావడం లేదా? వచ్చిన డబ్బులు సరిపోవడం లేదా? అన్న అనుమానాలేమీ అక్కర్లేదు.
రాజస్తాన్‌లో(Rajasthan) ఓ లేడీ డాక్టర్ పానీపూరీలు (Panipuri) అమ్ముకుంటున్నారు. పానీపూరీ బండిపై ప్రైవేట్ డాక్టర్ అని రాసిపెట్టుకున్నారు కూడా! ఆమెతో పని చేసిన సిబ్బందేమో పక్కనే టీ అమ్ముకుంటున్నారు. మరో డాక్టర్ తన ఆసుపత్రిని పరాఠా సెంటర్‌గా మార్చుకున్నాడు. ఇతనే కాదు ఇంకా చాలా మంది డాక్టర్లు రోడ్డుపై ఇలా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎందుకు? డాక్టర్ వృత్తిలో డబ్బులు రావడం లేదా? వచ్చిన డబ్బులు సరిపోవడం లేదా? అన్న అనుమానాలేమీ అక్కర్లేదు. ఇదంతా ప్రభుత్వంపై తమ నిరసనను తెలపడానికేనట! రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆరోగ్య బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్లంతా రోడ్డెక్కారు. ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు హెల్త్ బిల్లు ప్రకారం ప్రజలు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎక్కడైనా అత్యవసర వైద్యం పొందవచ్చు.
ఇదే ప్రైవేటు డాక్టర్ల ఆందోళనకు కారణమయ్యింది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని ప్రైవేటు డాక్టర్ల (Private Doctors) బృందం డిమాండ్ చేస్తూ భిన్నమైన రీతిలో ర్యాలీలు చేపట్టారు. ఈ చట్టం పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదన్నది వారి ఆరోపణ. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. రాజస్తాన్‌లో మొత్తం వైద్య సదుపాయాలను బందు చేసి నిరసనలు చేపడుతున్నారు. రాజస్తాన్‌లోని డాక్టర్ల ఆందోళనకు సంఘీభావంగా దేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్లు వస్తున్నారు. డాక్టర్ల తీరుపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ అయ్యారు. తనను కలవాల్సిందిగా డాక్టర్లకు చెప్పినా వారు పట్టించుకోలేదు. వైద్యులందరూ విధుల్లోకి రావాల్సిందంటూ మీడియా ద్వారా సూచించినా లైట్ తీసుకున్నారు. దీంతో ఈ నిరసనలను అణచివేసే పనిలో పడింది ప్రభుత్వం.