మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసగాళ్లు టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తుంటారు. ఇట్టాగే ఓ నగల వ్యాపారి(Gold shop owner) అమెరికాకు చెందిన మహిళను(america woman) నిట్ట నిలువునా మోసం చేశాడు. మేలిమి బంగారు నగల పేరుతో ఆరు కోట్ల రూపాయలను ఆమె నుంచి తీసుకున్నాడు. ఈ ఘటన రాజస్థానలో(Rajasthan) జరిగింది. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌కు వచ్చి అక్కడున్న బంగారు షాపు నుంచి బంగారు నగలు కొనుగోలు చేసింది.
మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసగాళ్లు టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తుంటారు. ఇట్టాగే ఓ నగల వ్యాపారి(Gold shop owner) అమెరికాకు చెందిన మహిళను(america woman) నిట్ట నిలువునా మోసం చేశాడు. మేలిమి బంగారు నగల పేరుతో ఆరు కోట్ల రూపాయలను ఆమె నుంచి తీసుకున్నాడు. ఈ ఘటన రాజస్థానలో(Rajasthan) జరిగింది. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌కు వచ్చి అక్కడున్న బంగారు షాపు నుంచి బంగారు నగలు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఆరు కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే అవి గిల్టు నగలు. వెండి ఆభరణాలకు బంగారు పూత పూసి చెరిష్‌కు ఇచ్చాడా షాపు యజమాని. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది చెరిష్. అప్పుడు అవి నకిలీవని తెలిసింది. వాటి విలువ 300 రూపాయలు మాత్రమేనని కూడా తెలిసింది. షాక్‌కు గురైన చెరిష్ వెంటనే జైపూర్‌కు వచ్చి షాపు యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది. వాడు చెరిష్ చెబుతున్నదంతా అబద్ధమన్నాడు. దాంతో చెరిష్ పోలీసులను ఆశ్రయించింది. అలాగే అమెరికా ఎంబసీ అధికారుల సాయం కూడా కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు. 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో చెరిష్‌కు పరిచయం ఏర్పడిందట! గత రెండేళ్లుగా ఆభరణాల కోసం 6 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెరిష్ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్ సోనీ, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉన్నారు.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.