రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పది ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..

రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌(Exit Poll)లో బీజేపీ(BJP) ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పది ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మూడు చోట్ల పోటీ కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో పాత సంప్రదాయం కొనసాగుతుంది. అసలు వాస్తవం ఏమిటో డిసెంబర్ 03న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే తేలనుంది.

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్‌పై రాజస్థాన్ మంత్రి ప్రతాప్ ఖచరియావాస్ మాట్లాడుతూ..నేను వివిధ సర్వేలను చూసిన.. కాంగ్రెస్(Congress) ముందంజలో ఉందని అన్నారు. బీజేపీది బూటకపు ప్రభుత్వమని, వీళ్లే హవా సృష్టిస్తున్నారని నేను ప్రజలకు వివరించాను. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్(Madhya Pradesh), రాజస్థాన్‌(Rajasthan)లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌పై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మహేష్ జోషి(Mahesh Joshi) మాట్లాడుతూ.. ఛానెల్‌లలో చూపిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ప్రజల ఎంపిక నిర్ణయాన్ని 3న వెల్లడిస్తార‌ని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

రాజస్థాన్‌లో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్‌పై బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రాజస్థాన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో మధ్యప్రదేశ్‌లో బిజెపి ముందంజలో ఉంది. 3న ఛత్తీస్‌గఢ్‌లో ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటాయని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి.

న్యూస్ 24- టుడేస్ చాణక్య సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 101 సీట్లు వస్తాయి. బీజేపీకి 89 సీట్లు, ఇతరులకు 09 సీట్లు వస్తాయని అంచనా.

దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 85-95 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 98-105 సీట్లు, ఇతరులకు 10-15 సీట్లు వస్తాయని అంచనా.

రిపబ్లిక్-మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 65-75 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 115-130 సీట్లు, ఇతరులకు 12-19 సీట్లు వస్తాయని అంచనా.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 94-104 సీట్లు వస్తాయి. బీజేపీకి 80-90 సీట్లు, ఇతరులకు 14-18 సీట్లు వస్తాయని అంచనా.

ఆజ్ తక్-యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 86-106 సీట్లు వస్తాయి. బీజేపీకి 80-100 సీట్లు, ఇతరులకు 9-18 సీట్లు వస్తాయని అంచనా.

టీవీ9 పోల్‌స్ట్రాట్ సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 90-100 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 100-110 సీట్లు, ఇతరులకు 5-15 సీట్లు వస్తాయని అంచనా.

రాజస్థాన్‌లో పీ మార్క్ సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో బీజేపీకి 105-125 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్‌కు 69-81 సీట్లు, ఇతరులకు 5-15 సీట్లు వస్తాయని అంచనా.

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 62-85 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా. బీజేపీకి 100-122 సీట్లు రావచ్చు. ఇతర పార్టీలకు 14-15 సీట్లు వస్తాయని అంచనా.

టైమ్స్ నౌ-ఈటీజీ ప్రకారం.. రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 110-128 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 56 నుంచి 72 సీట్లు వస్తాయని, ఇతరులకు 13 నుంచి 21 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

Updated On 30 Nov 2023 9:14 PM GMT
Yagnik

Yagnik

Next Story