రానున్న లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని(Rahul gandhi) నిలపాలని కాంగ్రెస్(Congress) నిర్ణయించిందని చెప్పారు.

రానున్న లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని(Rahul gandhi) నిలపాలని కాంగ్రెస్(Congress) నిర్ణయించిందని చెప్పారు. అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాల ప్రభావం ఉంటుందన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం అన్ని పార్టీలపైనా తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. ప్రజలు అలాంటి ఒత్తిడిని సృష్టించారన్నారు. అందుకే అన్ని పార్టీలతో ఓ కూటమి ఏర్పాటైందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దురహంకారి కాకూడదన్నారు. బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. మిగిలిన 69 శాతం మంది ఆయనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఇండియా కూటమి బెంగళూరులో సమావేశమైన తర్వాత ఎన్డీయే భయపడుతోందన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగనున్నట్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వెల్లడించారు. ఈ విషయంపై ఇండియా కూటమిలో చర్చించినట్లు తెలిపారు. అయితే, ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ ఉండేందుకు అన్ని పార్టీలు సమ్మతించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు దేశంలోని అన్ని పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయని సీఎం అన్నారు. దీని ఫలితంగా ఇండియా కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. ‘‘2014లో మోడీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచే అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఆయన అలా ఉండకూడదు. కేవలం 31 శాతం ఓట్లతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిగిలిన 69 శాతం ప్రజలు మీకు (మోదీ సర్కారుకు) వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. ప్రధాని 50 శాతం ఓట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే, జనాదరణ ఉన్నప్పుడే మోదీకి 50 శాతం ఓట్లు పడలేదు. అలాంటిది.. ఇప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది’’ అని అశోక్‌ గహ్లోత్‌ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రధాని ఎన్నో వాగ్దానాలు చేశారని.. వాటిని ఎంతవరకు అమలు చేశారో ప్రజలకు తెలుసున్నారు.

మీ మేధస్సుకు నా శాల్యూట్‌ : చంద్రయాన్‌ 3 విజయంలో నెహ్రూ, ఇందిరమ్మల పాత్ర కీలకం. చంద్రయాన్‌ 3 విజయవంతం కావడంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ పాత్రలు కీలకమైనవని గహ్లోత్‌ అన్నారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ సూచన మేరకు నెహ్రూ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పుడు దానికి వేరే పేరు ఉండేదని, ఇందిరా గాంధీ హయాంలో పరిశోధన కేంద్రానికి ఇస్రో గా నామకరణం చేశారని పేర్కొన్నారు. ఆనాడు వారు చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం చంద్రయాన్‌ 3 విజయవంతమైందని కొనియాడారు.

Updated On 27 Aug 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story