రాష్ట్ర మంత్రి రాజేంద్ర గూడా తొలగింపునకు సంబంధించి ముఖ్యమంత్రి సిఫార్సును గవర్నర్ ఆమోదించారని రాజ్ భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. రాజ్ భవన్ ప్రకటన ప్రకారం.. రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గూడాను తొలగించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ చేసిన ఈ సిఫార్సును గవర్నర్ వెంటనే ఆమోదించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి రాజేంద్ర గూడా ప్రకటన తర్వాత ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
రాజస్థాన్(Rajasthan CM) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) తన కెబినెట్‌లోని ఓ మంత్రిపై శుక్రవారం రాత్రి వేటు వేశారు. అశోక్ గెహ్లాట్ మంత్రి రాజేంద్ర గూడాను(Rajendra Gowda) తన మంత్రివర్గం నుంచి తొలగించారు. మహిళలపై అఘాయిత్యాల అంశంపై అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో రాజేంద్ర గూడపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా భద్రత(women Security) విషయంలో మన ప్రభుత్వం విఫలమైందని మంత్రి రాజేంద్ర సింగ్ గూడా సభలో పేర్కొన్నారు. మణిపూర్ సమస్యను కాదు.. మనం రాష్ట్రంలో పరిస్థితిని చూసుకోవాలని సభలో అన్నారు.
మణిపూర్‌లో కాకుండా మన పెరట్లోకి చూసుకోవాలని మంత్రి రాజేంద్ర గూడా తన సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి రాజేంద్ర గూడ అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్ని.. మహిళల భద్రత విషయంలో విఫలమయ్యామని అంగీకరించాలన్నారు. మణిపూర్‌కు బదులు.. రాజస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిన తీరు.. మన పెరట్లో చూసుకోవాలన్నారు.