రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గాయపడ్డారు. ఆయ‌న‌ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. చికిత్స కోసం ఆయ‌న‌ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం గెహ్లాట్ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో ఆయ‌న‌ వీల్ చైర్ పై కూర్చొని కనిపిస్తున్నారు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Rajasthan CM Ashok Gehlot)గాయపడ్డారు. ఆయ‌న‌ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. చికిత్స కోసం ఆయ‌న‌ జైపూర్‌(Jaipur)లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రి(Sawai Man Singh Hospital)లో చేరారు. చికిత్స అనంతరం గెహ్లాట్ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో ఆయ‌న‌ వీల్ చైర్ పై కూర్చొని కనిపిస్తున్నారు. సీఎం నివాసంలో నడుచుకుంటూ వెళుతుండగా జారిప‌డ‌డంతో గెహ్లాట్‌కు ఈ గాయమైంది. అయితే గెహ్లాట్ ఆరోగ్యం(Health) క్షీణించిందంటూ వార్త‌లు రాగా.. అధికారులు ఆ వార్త‌ల‌ను ఖండించారు. జారిప‌డ‌టంతో గెహ్లాట్ ఒక కాలులో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్(Hairline Fracture) అవ‌గా.. మరో కాలికి స్వల్ప గాయం ఉంది.

ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక్ గెహ్లాట్ ట్వీట్(Tweet) చేశారు. మీటింగ్ తర్వాత నివాసంలోని తన గదికి వెళుతుండగా.. జారిపడటంతో కాలుకు గాయాలయ్యాయి. ఎస్ఎంఎస్ ఆసుపత్రి(SMS Hospital)లో ప్రాథమిక చికిత్స తర్వాత.. నేను నా నివాసానికి వచ్చాను. ఫ్రాక్చర్ కారణంగా.. వైద్యుల సలహా మేరకు.. నేను కొన్ని రోజులు ఇంటి నుండి పని చేస్తూనని వెల్ల‌డించారు. అశోక్ గెహ్లాట్ కంటే ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కూడా గాయపడ్డారు. జూన్ 27న ఆమె హెలికాప్టర్(Helicopter) అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ల్యాండింగ్‌లో మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె మోకాలికి, నడుము వెనుక భాగంలో గాయం అయ్యింది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె.. బయటకు వెళ్లే సమయంలో చక్రాల కుర్చీలో కనిపించారు.

Updated On 29 Jun 2023 8:23 PM GMT
Yagnik

Yagnik

Next Story