రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఈ సాయంత్రానికి తేలనుంది. ఎంపీ-ఛత్తీస్‌గఢ్ మాదిరిగానే, ఇక్కడ కూడా బీజేపీ కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి.
రాజస్థాన్(Rajasthan) కొత్త ముఖ్యమంత్రి(Chief Minister) ఎవరనేది ఈ సాయంత్రానికి తేలనుంది. ఎంపీ-ఛత్తీస్‌గఢ్ మాదిరిగానే, ఇక్కడ కూడా బీజేపీ(BJP) కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సోమవారం ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం సీఎం అభ్యర్ధిని ఫిక్స్ చేసింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓబీసీ సామాజికవర్గం నుంచి వచ్చిన మోహన్‌యాదవ్(Mohan Yadav)ను బీజేపీ ముఖ్యమంత్రిని చేయగా.. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన సామాజికవర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయి(Vishnu Deo Sai)ని ముఖ్యమంత్రిని చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజస్థాన్‌లో జనరల్ కేటగిరీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ రాజస్థాన్ సీఎం పదవి మహిళకు అప్పగించవచ్చనే చర్చ కూడా సాగుతోంది.
సీఎం అభ్యర్ధి నిర్ణయంపై మంగళవారం జైపూర్ బీజేపీ కార్యాలయంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పార్టీ నియమించిన పరిశీలకులు రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh), సరోజ్ పాండే(Saroj Pandey), వినోద్ తావ్డేలు జైపూర్(Jaipur)కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. అనంతరం సీఎం పేరును ప్రకటిస్తారు.
ఢిల్లీ(Delhi) నుంచి వస్తున్న పరిశీలకులు.. ఎమ్మెల్యేలతో సీఎం అభ్యర్ధి విషయమై ముఖాముఖి చర్చించడం లేదని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశాల్లో స్పష్టమైంది. అంటే ఎమ్మెల్యేల ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు అడగరు. ముగ్గురు పరిశీలకులు ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన పేర్లకు సంబంధించి వన్‌లైన్ ప్రతిపాదనను పాస్ చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించింది. రాజస్థాన్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రకటన నేపథ్యంలో అందరి దృష్టి కూడా వసుంధర రాజేపైనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజే ముఖ్యమంత్రి రేసులో ముందుండగా.. మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ తప్పుకోవడంతో.. ఆమె సీఎం అయ్యే అవకాశాలు కూడా సన్నగిల్లాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌కు మరొకరు ముఖ్యమంత్రి అయితే వసుంధర రాజే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అందరిలో నెలకొన్న ఉత్కంఠ.