ప్రభుత్వ అధికారులు తల్చుకోవాలే కానీ చచ్చినవారిని బతికించగలరు. బతికున్నవారిని చంపేయనూగలరు. ఇప్పుడు రాజస్థాన్‌లోని(rajasthan) దౌసా(Dausa) జిల్లాలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వితంతు వృద్ధ మహిళ(Old Women) చనిపోయిందంటూ ఆమెకు రావాల్సిన పింఛన్‌ను(Pension) నిలిపివేశారు ప్రభుత్వ అధికారులు.

ప్రభుత్వ అధికారులు తల్చుకోవాలే కానీ చచ్చినవారిని బతికించగలరు. బతికున్నవారిని చంపేయనూగలరు. ఇప్పుడు రాజస్థాన్‌లోని(rajasthan) దౌసా(Dausa) జిల్లాలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వితంతు వృద్ధ మహిళ(Old Women) చనిపోయిందంటూ ఆమెకు రావాల్సిన పింఛన్‌ను(Pension) నిలిపివేశారు ప్రభుత్వ అధికారులు. పాపం బాదామ్‌ దేవి(Badam Devi) అనే ఆ వృద్ధురాలు తాను బతికే ఉన్నానని, తనకు తిరిగి పెన్షన్‌ ఇప్పించాలని మున్సిపల్‌ కార్యాలయం(Muncipal Office) చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తనకు పెన్షన్‌ నిలిపివేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

20 ఏళ్లుగా పెన్షన్‌ అందుకుంటున్న బాదామ్‌ దేవికి ఈ ఏడాది నుంచి పెన్షన్‌ రావడం లేదు. 2023 జనవరి 20 తేదీ నుంచి ఆమెకు పెన్షన్‌ను నిలిపివేశారు. అధికారులను కారణం అడిగితే అమె చనిపోయింది కాబట్టే పెన్షన్‌ను ఆపేశామని సమాధానం ఇచ్చారు. షాక్‌కు గురైన ఆ మహిళ తాను బతికే ఉన్నానంటూ ఈ ఏడాది జనవరి 6వ తేదీన లైఫ్‌ సర్టిఫికెట్‌ను(Life certificate) సమర్పించుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక విసుగు చెందిన బాదామ్ దేవి డెత్‌ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు నిర్ధారించినట్టు తనకు డెత్‌ సర్టిఫికెట్(Death certificate) ఇవ్వాలని కోరుతున్నారు. కాగా ఆమె దరఖాస్తును చూసిన అధికారులు కంగుతిన్నారు. మున్సిపల్ అధికారి సుభమ్‌ గుప్త(Subham Guptha) దర్యాప్తుకు ఆదేశించారు.

Updated On 11 July 2023 8:01 AM GMT
Ehatv

Ehatv

Next Story