Pakisthan Anju : ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన అంజు తిరిగొచ్చేసింది....
ఫేస్‌బుక్‌లో(Facebook) పరిచయమైన ప్రియతమ స్నేహితుడి కోసం భర్త, పిల్లలను వదిలేసి పాకిస్తాన్‌కు(Pakistan) వెళ్లిన అంజు(Anju) ఇండియాకు(India) తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, ఇంతకు మించి ఏమీ చెప్పలేనని మీడియాకు చెప్పింది.
రాజస్తాన్(Rajasthan) భివాడి జిల్లాకు చెందిన 34 ఏళ్ల అంజు రాఫెల్ పాకిస్తాన్‌కు చెందిన 29 ఏళ్ల నస్రూల్లా(Nusrullah) మధ్య ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. అది ఫ్రెండ్‌షిప్‌కు దారి తీసింది. ఆ స్నేహం ముదిరి ప్రేమగా మారింది.
ఫేస్‌బుక్‌లో(Facebook) పరిచయమైన ప్రియతమ స్నేహితుడి కోసం భర్త, పిల్లలను వదిలేసి పాకిస్తాన్‌కు(Pakistan) వెళ్లిన అంజు(Anju) ఇండియాకు(India) తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, ఇంతకు మించి ఏమీ చెప్పలేనని మీడియాకు చెప్పింది.
రాజస్తాన్(Rajasthan) భివాడి జిల్లాకు చెందిన 34 ఏళ్ల అంజు రాఫెల్ పాకిస్తాన్‌కు చెందిన 29 ఏళ్ల నస్రూల్లా(Nusrullah) మధ్య ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. అది ఫ్రెండ్‌షిప్‌కు దారి తీసింది. ఆ స్నేహం ముదిరి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో పెళ్లై, ఇద్దరు పిల్లలున్న అంజు ఈ ఏడాది జూలైలో పాకిస్థాన్‌కు వెళ్లి ప్రియుడ్ని కలిసింది. కేవలం ఫ్రెండ్‌షిప్ కోసమే ఆమె పాకిస్తాన్‌కు వెళ్లిందని అనుకున్నారు. కానీ పాకిస్తాన్‌లో తన ఫ్రెండ్ నస్రూల్లాను కలిసిన ఆమె అతడినే పెళ్లి చేసుకుంది. అంజు-నస్రూల్లా పెళ్లి ముస్లిం సంప్రదాయపద్దతిలో ఘనంగా జరిగింది. తర్వాత అంజు ఇస్లాం మతం పుచ్చుకుంది కూడా! తన పేరును ఫాతిమాగా మార్చుకుంది.ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్‌కు చెందిన అంజు భర్త అరవింద్ కుమార్(arvindh Kumar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అరవింద్‌తో పెళ్లి కోసం అంజు క్రైస్తవ మతంలోకి మారినట్లు తెలిసింది. 20 ఏళ్ల కిందట వీరిద్దరికి పెళ్లయ్యింది. ఆరు నెలల పాటు పాకిస్తాన్‌లో ఉంటున్న అంజు ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడిని కలిసేందుకు భారత్‌కు తిరిగి వచ్చినట్టు అంజు చెబుతోంది. పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్‌కు వచ్చిన అంజును దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్ క్యాంప్ దగ్గర ఆమెను ప్రశ్నించారు. తర్వాత అమృత్‌సర్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడ్నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లిందో తెలుసుకోడానికి అంజును మరింతగా ప్రశ్నించనున్నారు అధికారులు.