రైల్వే శాఖ(Railway Department) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు 25 శాతం(25% off) వరకు తగ్గించనున్నట్లు బోర్డు పేర్కొంది. గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు జోన్‌లను కోరింది.

వందేభారత్(Vande Bharat), అనుభూతి(Anubhuthi), విస్టాడోమ్(Vistadome) కోచ్‌లతో కూడిన అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలను ప్రయాణికుల సంఖ్యను బట్టి 25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రైల్ సేవల(Rail Service) వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీ సీటు రైలు ఛార్జీలలో రాయితీని మంజూరు చేయడానికి రైల్వేలోని వివిధ విభాగాల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అధికారం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో "అనుభూతి, విస్టాడోమ్ బోగీలతో సహా ఏసీ సీట్లు ఉన్న అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ తగ్గింపు పథకం వర్తిస్తుందని రైల్వే బోర్డు ఆర్డర్ పేర్కొంది.
బేసిక్ ఫేర్‌లో గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుందని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు అదనంగా వసూలు చేయబడవచ్చు. ప్రయాణీకుల సంఖ్యను బట్టి అన్ని తరగతులలో రాయితీ ఇవ్వబడుతుంది.