మంచి జీతం వచ్చే ఉద్యోగాన్నే ఎవరైనా కోరుకుంటారు. జీతానికి జీతం, హోదాకు హోదా ఉన్న ఉద్యోగాన్ని చూస్తూ చూస్తూ ఎవరు వదులుకోరు. కానీ రాహుల్ పాండే(Rahul pande) ఆ పని చేశాడు. ఫేస్‌బుక్‌లో(Facebook) ఉద్యోగాన్ని సంపాదించుకున్న రాహుల్ పాండే జీతం ఎంతనుకున్నారు? సాలీనా అక్షరాల ఆరున్నర కోట్ల రూపాయలు.
మంచి జీతం వచ్చే ఉద్యోగాన్నే ఎవరైనా కోరుకుంటారు. జీతానికి జీతం, హోదాకు హోదా ఉన్న ఉద్యోగాన్ని చూస్తూ చూస్తూ ఎవరు వదులుకోరు. కానీ రాహుల్ పాండే(Rahul pande) ఆ పని చేశాడు. ఫేస్‌బుక్‌లో(Facebook) ఉద్యోగాన్ని సంపాదించుకున్న రాహుల్ పాండే జీతం ఎంతనుకున్నారు? సాలీనా అక్షరాల ఆరున్నర కోట్ల రూపాయలు. ఆ ఉద్యోగాన్నే వదిలేశాడు. అందుకు కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం! మెటాలో (Meta)టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా అయిదేళ్ల పాటు పని చేసిన రాహుల్ పాండే 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పటికే అతడి జీతం ఆరున్నర కోట్ల రూపాయల కంటే ఎక్కువే. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వా ఫేస్‌బుక్‌లో పని చేశాడు. అందులో తన అనుభవాలను వివరిస్తూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్‌లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్‌గా ఎంతో ఆత్రుతగా పనిచేశానని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని అందులో రాహుల్ పాండే చెప్పుకొచ్చాడు. 'ఫేస్‌బుక్‌లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్‌లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్‌కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించాను' అని రాహుల్ పాండే తెలిపాడు.