కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వాయనాడ్‌లో పర్యటించనున్నారు. పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత రాహుల్ వాయనాడ్ ప్రజలతో మమేకం అయ్యేందుకు తొలిసారి అక్కడికి వెళుతున్నారు.
కాంగ్రెస్(Congress) అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వాయనాడ్(Wayanad)లో పర్యటించనున్నారు. పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత రాహుల్ వాయనాడ్ ప్రజలతో మమేకం అయ్యేందుకు తొలిసారి అక్కడికి వెళుతున్నారు. అందుకే ఇది రాహుల్-కాంగ్రెస్(Rahul-Congress) ల పవర్ షోగా కూడా పరిగణిస్తున్నారు. రాహుల్ వాయనాడ్‌కు బయలుదేరారు.
మోదీ ఇంటిపేరు కేసు(Modi Surname Case)లో సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి ఉపశమనం పొందిన తర్వాత రాహుల్ గాంధీ గత సోమవారం అంటే ఆగస్టు 7న లోక్‌సభ(Loksabha) సభ్యత్వాన్ని తిరిగి పొందారు. 'మోదీ' ఇంటిపేరు వ్యాఖ్య కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు తీర్పుపై ఆగస్టు 4న సుప్రీం కోర్టు స్టే విధించడంతో లోక్‌సభ సెక్రటేరియట్(Lok Sabha Secretariat) రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది.
రాహుల్ పర్యటనకు ముందు మంగళవారం కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీటీ సిద్ధిఖీ(KPCC President VT Siddiqui) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆగస్టు 12న వయనాడ్‌కు రానున్నారు. వారి రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. రేపు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఉంది. రాహుల్ గాంధీ ఆగస్టు 12, 13 తేదీల్లో పర్యటనలో ఉంటారని పేర్కొన్నారు. వయనాడ్ చరిత్రలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం(Grand Welcome) లభిస్తుందని సిద్ధిఖీ అన్నారు.