విపక్షాల అవిశ్వాస తీర్మానంపై నేటి నుంచి చర్చ ప్రారంభం కానుంది. కాంగ్రెస్(Congress) ఎంపీ రాహుల్ గాంధీ(Rahul gandhi) చర్చను ప్రారంభించే అవ‌కాశం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ(PM Narendra Modi) ఆగస్టు 10న సమాధానం ఇవ్వ‌నున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల స‌మ‌యం కేటాయించారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

16 గంట‌ల్లో బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్‌కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకు 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 30 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్‌ 12 నిమిషాలు, ఎల్జేఎస్పీకి 8 నిమిషాలు స‌మయం కేటాయించారు.

మిగిలిన ఎన్డీఏ అనుకూల పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 17 నిమిషాలు స‌మ‌యం దొరికింది. ఇందులో అన్నాడీఎంకే, ఏజేఎస్‌యూ, ఎంఎన్ఎఫ్‌, ఎన్ఫీపీ, ఎస్‌కేఎం పార్టీలు ఉన్నాయి. ఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, టీడీపీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలకు కలిపి 52 నిమిషాల సమయం కేటాయించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ మూడోరోజు సమాధానం ఇవ్వనున్నారు.

Updated On 8 Aug 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story