Another Yatra by Rahul: రాహుల్ భారత్ న్యాయ యాత్ర
ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో కీలక యాత్రకు శ్రీకారం చుట్టారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్ర చేపట్టనున్నారు. 'భారత్ న్యాయయాత్ర' (Bharath Nyaya Yatra) పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించారు

rahul-compressed
ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో కీలక యాత్రకు శ్రీకారం చుట్టారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్ర చేపట్టనున్నారు. 'భారత్ న్యాయయాత్ర' (Bharath Nyaya Yatra) పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించారు. మణిపూర్ (Manipur) నుంచి ముంబై (Mumbai) వరకు పాదయాత్రతో పాటు బస్సు యాత్ర కూడా చేయనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు నాగాలాండ్, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా 6,200 కి.మీ. భారత్ న్యాయయాత్ర చేపట్టాలని రాహుల్ నిర్ణయించారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. 2022 సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర 2023 జనవరి 30న ముగిసింది. దాదాపు 12 రాష్ట్రాల మీదుగా రాహుల్ పాదయాత్ర చేశారు. 145 రోజుల పాటు 3970 కి.మీ మేర సాగింది.
