ప్రధాని మోడీ(PM Narendra Modi) దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అతను 2000లో గుజరాత్‌లో బీజేపీ(BJP) ప్రభుత్వ హయాంలో OBC జాబితాలో చేర్చబడిన 'తెలి' కులానికి చెందిన కుటుంబంలో జన్మించాడు. కాబట్టి మోడీ పుట్టుకతో OBC కాదని రాహుల్ చెప్పారు. మన ప్రధాని తాను వెనుకబడిన వర్గానికి చెందినవాడినని దేశం మొత్తానికి అబద్ధం చెప్పారని వారికి బీజేపీ కార్యకర్తలకు చెప్పండని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. మోడీ ఓబీసీ కులానికి చెందినవాడు కాదన్నారు.
ప్రధాని మోడీ(PM Narendra Modi) దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అతను 2000లో గుజరాత్‌లో బీజేపీ(BJP) ప్రభుత్వ హయాంలో OBC జాబితాలో చేర్చబడిన 'తెలి' కులానికి చెందిన కుటుంబంలో జన్మించాడు. కాబట్టి మోడీ పుట్టుకతో OBC కాదని రాహుల్ చెప్పారు. మన ప్రధాని తాను వెనుకబడిన వర్గానికి చెందినవాడినని దేశం మొత్తానికి అబద్ధం చెప్పారని వారికి బీజేపీ కార్యకర్తలకు చెప్పండని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. మోడీ ఓబీసీ కులానికి చెందినవాడు కాదన్నారు. మీరు ఈ విషయాన్ని ప్రతి బీజేపీ కార్యకర్తకు చెప్పండని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటులో మోడీ తనకు తాను "సబ్సే బడా OBC" అని ప్రకటించడంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం లోక్‌సభలో(Lok sabha) రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలుపుతూ కాంగ్రెస్‌పై మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ(Congress), యూపీఏ ప్రభుత్వం ఓబీసీలకు న్యాయం చేయలేదు. కొద్ది రోజుల క్రితం కర్పూరీ ఠాకూర్‌కి భారతరత్న పురస్కారం లభించింది. 1970లో బీహార్ సీఎం అయినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎంత మంది బీసీలు ఉన్నారని అడుగుతున్నారు. అందరికంటే పెద్ద బీసీని నేను కనిపించడంలేదా అని మోడీ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిశాలో ఉన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశా, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు రాహుల్ దిగారు.