అదానీ గ్రూప్‌(Adani Group) చైర్మన్‌ గౌతం అదానీపై(Gautham adani) అమెరికాలో(America) బిలియన్‌ డాలర్ల లంచం(Corruption), మోసానికి(Fraud) పాల్పడ్డారన్న అభియోగంతో కేసు నమోదైంది.

అదానీ గ్రూప్‌(Adani Group) చైర్మన్‌ గౌతం అదానీపై(Gautham adani) అమెరికాలో(America) బిలియన్‌ డాలర్ల లంచం(Corruption), మోసానికి(Fraud) పాల్పడ్డారన్న అభియోగంతో కేసు నమోదైంది. అదానీతో పాటు ఆయన సమీప బంధువు సాగర్‌ అదానీతో(Sagar adani) పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సోలార్‌ పవర్‌ సరఫరా కాంట్రాక్టుల(Solar power suplly contract) కోసం భారత అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అదానీ గ్రీన్‌ ఎనర్జీలో కూడా అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు తెలిపారు. అదానీ సంపద 69.8 బిలియన్‌ డాలర్లు. ఈ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. ఇదే అంశంపై ఢిల్లీలో(Delhi) కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul gandhi) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదానీ అక్రమాలను దేశవ్యాప్తంగా ఎండగడతామన్నారు. వెంటనే అదానీని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కుట్రలో ఎవరున్నా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. అయితే ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రాహుల్‌గాంధీ సంచలన సమాధానం ఇచ్చారు. ఈ మధ్యే కాంగ్రెస్ పాలిత కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అదానీ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి.. దీనిపై కూడా విచారణ జరగాలా అని మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు 'తప్పకుండా విచారణ జరగాలి..అదానీని అరెస్టు చేయాలి..ఇతరులు ఎవరున్నా వారిని కూడా అరెస్టు చేయాలని రాహుల్‌ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాహుల్‌ వ్యాఖ్యలను బట్టి రేవంత్‌పై త్వరలో చర్యలు తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

Eha Tv

Eha Tv

Next Story