కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి ట్రక్కులో అంబాలా నుంచి చండీగఢ్ వరకు 50 కిలోమీటర్లు ప్రయాణించారు. వాస్తవానికి రాహుల్ ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరారు. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్లతో రాహుల్ మాట్లాడారు. వారి సమస్యలు విన్నారని పార్టీ కార్యకర్తలు తెలిపారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం రాత్రి ట్రక్కు(Truck)లో అంబాలా(Ambala) నుంచి చండీగఢ్(Chandigarh) వరకు 50 కిలోమీటర్లు ప్రయాణించారు. వాస్తవానికి రాహుల్ ఢిల్లీ(Delhi) నుండి సిమ్లా(Shimla)కు బయలుదేరారు. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్ల(Truck Drivers)తో రాహుల్ మాట్లాడారు. వారి సమస్యలు విన్నారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఆయన ప్రయాణానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథ్(Supriya Srinathe) సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేశారు.
यूनिवर्सिटी के छात्रों से
खिलाड़ियों से
सिविल सर्विस की तैयारी कर रहे युवाओं से
किसानों से
डिलीवरी पार्टनरों से
बस में आम नागरिकों से
और अब आधी रात को ट्रक के ड्राइवर से
आख़िर क्यों मुलाक़ात कर रहे हैं राहुल गांधी?
क्योंकि वो इस देश लोगों की बात सुनना चाहते हैं,… pic.twitter.com/HBxavsUv4f
— Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023
అయితే.. యూపీ(Utterpradesh) రాజధాని లక్నో(Lucknow) నుంచి రాహుల్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయమై లక్నో పోలీసులు(Police) ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సమయంలో ఆయన సెక్యూరిటీ(Security) లేకుండా ధైర్యంగా లారీలో ప్రయాణించడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
రాహుల్ గాంధీ ట్రక్ ప్రయాణం గురించి.. హర్యానా కాంగ్రెస్ నాయకుడు(Haryana Congress Leader) ఒకరు మాట్లాడుతూ.. సోనియా(Soniya)ను కలిసేందుకు రాహుల్ సిమ్లాకు వచ్చారని చెప్పారు. ప్రస్తుతం సోనియా సిమ్లాలోని ప్రియాంక గాంధీ ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. సిమ్లాలో ఉండే కర్ణాటక ముఖ్యమంత్రి(Karnataka CM) నిర్ణయం కూడా తీసుకున్నారనే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
अलग ही शख़्स हैं - राहुल गांधी
आज वो इस देश में आम जनता और सरकार के बीच में बढ़ती खाई को ख़त्म करने के लिए प्रतिबद्ध हैं
फिर इस गर्मी में रात भर ट्रक चालकों के साथ बैठ उनकी समस्या सुनना या ट्रक में सफ़र करना ही क्यों ना हो
ऐसे ही थोड़े ही लोगों में बेहतर भविष्य की उम्मीद जग… pic.twitter.com/gJ3SwNlfyI
— Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023
కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథ్ రాహుల్ వీడియో ని షేర్ చేస్తూ.. రాహుల్‌గాంధీ అర్థరాత్రి ట్రక్కు డ్రైవర్లను ఎందుకు కలిశారు? ఎందుకంటే ఆయన ఈ దేశ ప్రజల కష్టాలను వినాలనుకుంటున్నారు. వారి సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకోవాలనుకుంటున్నారని రాసుకొచ్చారు. ఇలా చేయడం చూస్తుంటే ఒక నమ్మకం కలుగుతుంది. నెమ్మదిగా ఈ దేశం రాహుల్ గాంధీతో కదులుతోందని ఆమె అన్నారు.