కేరళ(Kearala)లోని వాయనాడ్‌ లోక్‌సభ(Wayanad Lok Sabha) నుంచి పోటీ చేసిన రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నిర్ణీత గడువులోగా ఆ ఖర్చులు సమర్పించలేదట. అందుకు రాహుల్‌గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.. రాహుల్‌గాంధీపై కేంద్రం ఎందుకింత కక్షకట్టింది? అని అనుకునేరు. ఈయన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కాదు. రాహుల్‌గాంధీ పేరుపెట్టుకున్న ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థి.

కేరళ(Kearala)లోని వాయనాడ్‌ లోక్‌సభ(Wayanad Lok Sabha) నుంచి పోటీ చేసిన రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నిర్ణీత గడువులోగా ఆ ఖర్చులు సమర్పించలేదట. అందుకు రాహుల్‌గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.. రాహుల్‌గాంధీపై కేంద్రం ఎందుకింత కక్షకట్టింది? అని అనుకునేరు. ఈయన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కాదు. రాహుల్‌గాంధీ పేరుపెట్టుకున్న ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థి. ఈయన కూడా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్‌ నుంచే పోటీ చేశాడు. ఈయన పూర్తి పేరు కె.ఇ.రాహుల్‌గాంధీ. ఆ ఎన్నికల్లో ఈయనకు 2,196 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఏడు లక్షలకు పైగా ఓట్లు లభించాయి. కె.ఇ.రాహుల్‌గాంధీ అనే ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయలేదట. అందుకే 2021 సెప్టెంబర్‌ 13 నుంచి 2014 సెప్టెంబర్‌ 13 వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ఎన్నికల సంఘం పరిగణించింది. ఆ మేరకు ఆయనకు సమాచారం కూడా ఇచ్చింది.

Updated On 1 April 2023 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story